బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

3.6  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

బహు(కోడలు)మతి

బహు(కోడలు)మతి

8 mins
796


చిన్ని కి మళ్లీ జ్వరం వచ్చింది అమ్మ ...


మళ్లీనా...ఎం చూసుకుంటున్నారు పిల్లల్ని...ఎవరికయినా వస్తుందా ఇన్ని సార్లు...పిల్లల్ని చూసుకోవడం రాకుంటే

ఎలా....


ఇప్పుడే కదా ...అమ్మ! దానికి పిల్లలని చూసుకోవడం

గురించి ఎం తెలుసు...


అందరూ కనడం లేదా....చూసుకోవడం లేదా....నాకయితే 12 ఏళ్లకే అయింది పెళ్లి..15 ఏళ్ళకి నువ్వు నా చేతిలో వున్నావు....ఒక్క దాన్నే నిన్ను చూసుకుంటూ పనులు అన్నీ చేసుకొనే దాన్ని...అయిన చూస్తున్న నిన్ను నీ పెళ్ళాం నీ బాగానే వెనకేసుకవస్తున్నవు...నువ్వు ఇలా చేస్తే ఇంకా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది రా...అని మొహం నీ మెలికలు తిప్పుతూ అంటుంది రాజీ...


కొడలుకు సపోర్ట్ గా మాట్లాడితే అమ్మ కి నచ్చదు..అమ్మ కి సపోర్ట్ ఇస్తే కోడలు కి నచ్చదు..గత నెలరోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగం అది...ఎప్పుడు చిరాకుగా వుంటున్నారు...తిట్టుకోవడం కొట్టుకోవడం లేదు కానీ మౌనం గా నే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోలోపల యుద్ధమే చేస్తున్నారు....పంతం పట్టి సాధించే దాకా నిద్ర పోరు కాబోలు చూస్తుంటే అలానే ఉంది యవ్వారం....ఎవరికి ఎం చెప్పలేక నోరు అదుపులో వుంచుకొని తన పని తను చేసుకొని మొబైల్ లో దూరి వుంటున్నాడు ఆదిత్య...


ఆది....బాబు ఆదిత్య....అన్న అమ్మ పిలుపు కి ఫోన్ పక్కకు పెట్టీ కనపడి కనపడనట్టు కనిపిస్తున్న కర్టెన్ వెనక వున్న ఆకారం చూడటానికి ప్రయత్నం చేసాడు ఆది....సరిగ్గా కనపడలేదు...లేచి బయటకు వచ్చాడు.... ఆది రాకను చూసి...మీ అత్తయ్య వచ్చారు రా అని అంటూ హాల్లో కి వెళ్లి పోయింది...రాజీ


రండి అత్తమ ....మీ అమ్మాయి గది లో వుంది వెళ్ళండి....అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు ...కుశల ప్రశ్నలు అన్ని అయ్యాక సరే బాబు అని అన్నట్లు చిన్న చిరు నవ్వు నవ్వి లోపలే వుందా అమ్మాయి అని అంటూ గదిలోకి వెళ్ళింది...


అమ్మ నీ చూడగానే గది సర్దడం అపేసి నవ్వుతూ తల్లి నీ పలకరిస్తుంది...


ఎంటి అమ్మ అల చిక్కిపోయావు...సరిగ్గా తినడం లేదా...


నేను లావు అయ్యనూ అని ఎప్పుడు అన్నావు నువ్వు కానీ... కూర్చో...అందరూ ఎలా వున్నారు...


బానే ఉన్నా కానీ...ఎందుకు అల వున్నావు...ఎం అయింది...


ఎం కాలేదు ....నువ్వు చీకటిలో బాణం వేస్తున్నవని నాకు తెలుసు లే అమ్మ...


అరె ఏమైందీ అని అంటూ వుంటే....చెప్పకుండా సామెతలు చెప్తావు ఎంటి...


అరె...ఎం కాలేదు అని అంటూ వుంటే..మళ్లీ అదే అంటున్నావు...

సరే లే పదా మనం ఇంటికి వెళదాం ఒక పది రోజులు వుండి వద్దువు...


ఇప్పుడా? ఎందుకు అమ్మ..


ఊరికే ....ఎందుకు ఎం అయిన వుంటే నే వస్తావా...పదా....


ఆయనకి చెప్పాలి...ఇంట్లో చెప్పాలి...మనసులో సంతోషం గా వున్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానం తో ఆలోచిస్తుంది...


గదిలోకి వచ్చి న ఆదిత్య వంక చూస్తూ..


అమ్మ రెండు రోజులు ఇంటికి తీసుకొని వెళతాను అని అంటుంది...వెళ్లి వస్తాను అండి అని గోముగా అడిగింది..


రెండు రోజుల...కాదు పది రోజులు...అని ఆదిత్య సమాధానం చెప్పక ముందే అత్తగారు అన్న మాట కి ఆదిత్య కి కాస్త కోపం కూడా వచ్చింన్ది...


అన్ని రోజులు ఎం చేస్తా...అని అమ్మ తో అంటుంది ఆదిత్య కి వచ్చిన కోపాన్ని గమనించి...


అదేంటి అల అంటావు...నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు పది రోజులు ఉండకూడదా...


ఇద్దరి మధ్య సంభాషణ కి ఆదిత్య అడ్డు చెప్తూ...

నేను కాదు అని అనడం లేదు కానీ...ఇంట్లో నేను మాత్రం అడగను.. మీరే అడగండి అత్తయ్య...ఆ రోజే నేను అడిగి పంపినందుకు మళ్లీ వచ్చే దాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు....మీరే అడగండి...ఎలానో తన కాలేజి కి వెళ్లి ఏవో చూసుకోవలసిన పనులు వున్నాయి కదా...అదే చెప్పండి ఎందుకు అని అంటే...అని సమాధానం ఇచ్చాడు ఆదిత్య..


అమ్మ గారు ఎక్కడ వున్నారు బాబు...


వంట గదిలో వున్నారు అత్తయ్య...


సరే బాబు...అని వంట గది వైపు వెళ్ళింది .....


అత్తగారు వెళ్ళడం చూసి...ఆదిత్య మళ్లీ బెడ్ పైన వాలిపోయాడు....

అమృత సైలెంట్ గది సర్ధ్తుతుంది...ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు...అమృత తన పని లో తాను బిజీ గా ఉంది...ఆదిత్య కి అమృత నీ చూస్తూ వుంటే మనసులో ఎదో తెలియని బాధ ...

అమృత...పెళ్లి కి ముందు ఎంత అందం గా వుండేది..ఎప్పుడు మొహం లో ఆనందం వెళ్లి విరిసేది...లేత గులాబీ నీ చూస్తే ఎంత అందం గా వుంటుంది...అంత అందంగా కనిపించేది...బాహ్య సౌందర్యం కంటే...తన మనసు ఇంకా అందం గా వుంటుంది...ఆ విషయం తన దగ్గరి వారికి మాత్రమే తెలుసు..చెరగని చిరునవ్వు తన సొంతం...నిజం చెప్పాలి అంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్...ఎవరినయినా తన నుంచి చూపు నీ తిప్పుకొనిచ్చేది కాదు...పొద్దు తిరుగుడు పువ్వు ల తన వైపు మరల్చే అంత శక్తి తన నవ్వు కి వుంది..

కానీ ....గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయం అయ్యింది అర్థం కావడం లేదు ఆదిత్య కి....జీవితం ఇప్పుడే ముగిసి పోలేదు..ప్రారంభం అయింది ...అసలు తన సంతోషం ఎంటి ...బాధ ఎంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజం గా తనను ప్రేమగా చూసుకొనే బర్త గా మారుత కదా..తెలుసుకోవాలి...కానీ ఎలా తనని నేరుగా అడిగితే తను అస్సలు చెప్పదు తను సంతోషం గా నే వున్న అని బయటకి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంది....

అమ్ము అని అంటూ వచ్చిన అత్తగారి మాట తో తన ఆలోచనలకు అడ్డు కట్ట పడింది.....


ఏమన్నారు అత్తయ్యా....


చాలా సేపు బతిమిలాడ బాబు...ఒప్పుకోవడం లేదు...

కాలేజి కి వెళ్లి తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏవో వున్నాయి అంట...ఇంటికి తీసుకొని వెళతాను అని అంటే...


ఇక్కడి నుండి కూడా కాలేజి కి వెళ్లి రావచ్చు గా....


వాళ్ళ డాడ్ తో వెళ్ళాలి అంట..అంటే....

ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్లి దింపేయండీ మళ్లీ...కాలేజి కి వెళ్ళడానికి ఇంటికి ఎందుకు....

అని అంటున్నారు...వదిన గారు...అని లోపల కాస్త బాధ గా చెప్పింది...కూతురు నాకు ముందే తెలుసు అని అన్నట్లు చూసి మళ్లీ తన గది సర్దడం లో బిజీ అయిపోయింది....


మీరు కూర్చోండి అత్తయ్యా ...నేను అడిగి వస్తా....అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు...


అమ్మ నాలుగు రోజులు వెళ్లి వస్తుంది అమృత...


మీ అత్తగారికి ముందే చెప్పా కదా...మళ్లీ నిన్ను పంపిందా.,నేను చెప్పా కదా అక్క...మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మ గా మారిపోయాడు అని...చూడు ....అత్త ..పెళ్ళాం చెప్పి పంపారు కావచ్చు అందుకే వచ్చాడు ఒప్పించడానికి అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మ తో అంటుంది....ఏడుపు నీ ఆవరించిన స్వరం తో....


నువ్వు ఎందుకు ఏడుస్తావే....అరేయ్ ఆధి...ఎందుకు రా మీ అమ్మ నీ ఇలా వేయించుకుని తింటున్నారు....నువ్వు కూడా ప్రతి సారి ఇలా వాళ్ళకి వత్తాసు పలుకుతూ వుంటే....మీ అమ్మ పరిస్థితి ఏమిటి...అయిన ఇల్లు ఒక ఊరిలో వుంటే మాత్రం మాటి మాటీ కి వెళ్లి రావల..అని మొదలు పెట్టారు...వాళ్ళ ఉపన్యాసం అయిపోయే సరికి దాదాపు పది నిమిషాలు పట్టింది....చివరికి వాళ్ళ మాటే నెగ్గింది....ఆదిత్య ఓటమి తో వెను తిరిగి తన గది వైపు వెళ్ళాడు...తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చు అత్తయ్య అని ఆలోచిస్తూ నే గది లోకి వెళతాడు...


ఆశ గా చూస్తూ వున్న అత్తగారు వైపు చూస్తూ ...తరువాత తీసుకొని వెళ్ళండి అని అన్న మాట వినగానే తన మొహం లో కోపం బాధ,ఏమి చేయలేని నిస్సహాయ స్థితి తనను అక్కడ నిలువ నివ్వడం లేదు...సరే అమ్మ నేను వెళ్తున్న...


కనీసం...మంచి నీళ్ళు అయిన తాగి వెళ్ళండి....


ఇక్కడే కదా ఇల్లు.అవసరం లేదు బాబు...అని వెళ్లిపోయింది...


అమృత ఇంకా గది సర్దుతూ నే వుంది...అగ్గిపెట్టె లాంటి గది నీ అర్ధ గంట నుంచి సర్దుతుంది ..అమ్మ మీద కోపం ఎలా బయటపెట్టాలని తనకు కూడా తెలియకుండా నే...ఎంత సేపు సర్ధుతవు అని చిరాకుగా అంటాడు...


లేని నవ్వు నీ తెచ్చుకొని....మీ మాట నేిగ్గనివ్వలేదు అని అనే కోపం నీ నాపై ఎందుకు అండి చూపిస్తారు....నేను ఎం చేయలేను అని ఆ...అని అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది...


అప్పటి నుండి గది లో నే వున్న గది నీ పట్టించుకోలేదు...చూసి ఒక్క సారి గా కంగుతిన్నాడు...

గది సెల్ఫ్ లలో...తనకు పెయింటింగ్ లలో వచ్చిన బహుమతులు...గోల్డ్ మెడల్స్..స్టేట్ లెవెల్ లో ప్రైజ్ వస్తె గవర్నర్ నరసింహన్ గారితో పాటు దిగిన ఫోటో లు..కేసిర్ తో దిగిన ఫోటో లు...తను మిస్ ఫేర్వెల్ గా వచ్చిన ఫోటో లు అన్ని తీసి సర్ధి సజ్జ పై సర్ధేసింది....అవి అంటే తనకు ప్రాణం మరి ఎందుకు ఇలా చేసింది కావచ్చు...అని ఆలోచిస్తూ సజ్జే పై చూస్తాడు...అన్ని ఒక బాక్స్ లో వున్నాయి....అందులో ఒక పుస్తకం కూడా వుంది ....తీసి చూసాడు... అది తన డైరీ...ఇతరుల డైరీ చదవడం తప్పు కానీ....అమృత మళ్లీ నవ్వుతూ తిరగాలి అంటే...తన మనసు లో వున్న బాధ తెలియాలి...అంటే ఇదే మార్గం అని..డైరీ తీసి పరుపు కింద పెట్టీ గది నుంచి బయటకు వచ్చి అమృత ఎక్కడ వుంది అని చూస్తాడు...తను బట్టలు వుతుకడం చూసి..గంట సేపు రాదు అని నిశ్చయించుకొని...గది లో కి వెళ్ళి తలుపు దగ్గరకు వేసి....బెడ్ కింద వున్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు...


అన్ని తను సంతోషం గా గడిపిన రోజులు...మొదటి సారి మ్యాగి చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం..బహుమతులు పొందుకున్నపుడు వాళ్ళ అమ్మ కనులలో చూసిన ఆనందం....తోబుట్టువు లతో చేసిన అల్లరులు...స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపం లో ఎంత చక్కగా రాసుకుంది....అప్పటి నుంచి వెతికిన తన గురించి కూడా వుంది...తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది అమృత చూసి సంబర పడిపోయాడు..ఇంకా పేజీలు తిప్పి చూసే సరికి ఒకే పేజీ ఉంది....దానిలో అయిన అమృత బాధ తెలుస్తుంది కావచ్చు అని చూసాడు కానీ లేదు....తన ఆశలు ఆవిరి అయ్యాయి..డైరీ క్లోజ్ చేయబోయే సమయం లో చివరి పేజీ చింపి వుండటం గమనించాడు....అంటే తను ఎదో రాసింది మళ్లీ చింపి పడేసింది....తప్పకుండా డస్ట్ బిన్ లో నే పడేసి వుండాలి..అని ఆత్రుత గా డస్ట్ బిన్ వైపు చూసాడు....అందులో చెయ్యి పెట్టాలని అనిపించలేదు...కానీ ఎలా అయిన అమృత బాధ నీ తెలుసుకోవాలి అని ఆశతో...అందులో వెతుకుతూ ఉంటాడు....గది సర్దడం వలన కావచ్చు అన్ని ఏవేవో పేపర్లు వున్నాయి....తను వెతికే ప్రయత్నం మానలేదు....దొరకడం లేదు అని డస్ట్ బిన్ లో వున్న చెత్త అంత కింద పడేశాడు...డైరీ లో వున్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి వుంది...దాన్ని ఓపెన్ చేసి చూసాడు...అమృత చేతి వ్రాత... తను వస్తున్నట్టు కాలి పట్టి శబ్దం వినపడింది.

.చెత్త అంత అందులో పడేసి ఏమి తెలియదు అన్నట్లు బెడ్ మీద వాలి పోయాడు...

అమృత వచ్చాక...అప్పుడే నిద్ర నుంచి లేస్తున్నట్లు నటించి ....నేను కాస్త బయటకి వెళ్లి వస్తా అని నేరుగా గార్డెన్ కు బయలుదేరాడు..ఒక బల్ల మీద కూర్చొని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేసాడు...


ఈ లోకం పోకడ నీ ఎలా అర్థం చేసుకోవాలి అస్సలు అర్ధం కావడం లేదు నాకు..మంచిగా వున్న చెడ్డగా వున్న తప్పుపడుతూ నే వుంటుంది....లోకం లో వివాహ బంధం కి ఒక ప్రత్యేక స్థానం ఉంది... ఏ కులం అయిన మతము అయిన వేరే దేశం అయిన ప్రపంచమంతా వివాహ బంధం ఉంది ...అంటే అది ఎంత అమూల్యం అయి ఉండాలి....అమ్మాయి అప్పటి వరకు చూడని అబ్బాయిని..కలవని కుటుంబం నీ తన కుటుంబం గా మార్చే శక్తి వివాహ బంధానికి కాక మరే బంధానికి వుంది...అలాంటి వివాహ బంధం కలకలం పదిలం గా వుండాలి అంటే...అమ్మాయి తన అస్తిత్వం నీ కోల్పోవడం తప్పదా..?

అసలు ఎందుకు కోల్పోవలి...?

తనకు అంటూ ఇష్టాలు ఉండకూడదా..?

తనకు అంటూ కోరికలు ఉండకూడదా..?తను జీవించాలి అని అనుకొనే జీవితం కి తనవారే తనకు ఆంక్షలు విధించడం ఎంత వరకు సమంజసం....!

మంచితనం నీ అలుసుగా తీసుకొని అజమాయిషీ చలయించడం ఎంత వరకు మంచిది...

ప్రతి సారి మౌనం అంగీకారం కాదు...ఎదుటి వారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ యివ్వడం కూడా అవ్వవచ్చు...దాన్ని తప్పు పట్టడం సరి యేన...


నేను చేసిన నేరం ఎంటి....?

అత్తగారిని ఒక అమ్మ ల...ఒక స్నేహితురాలు గా బావించడమా...!

నాకు అంటూ ఒక గుర్తింపు వుండాలని ఆశ పడటం, నా ఇష్టాలను ఒకరికోసం మార్చుకోకుండా వుండటం నేను చేసిన నేరమా!


అన్నింటి కంటే నాకు నా కుటుంబం ముఖ్యం.. దాని ముందు నాకు అన్ని తక్కువే...

కానీ ఈ రోజు నేను విన్న మాటలు తూటాల్లా నన్ను కాల్చేస్తున్నయి...

సాయంత్రం పూలు అల్లుతు కూర్చున్న ఆడంగుల ముచ్చట్ల సమావేశం...ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట ఎం చేయమంటారు అని అత్తగారిని అడగడానికి వచ్చి అప్రయత్నం గానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నయీ...ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను...


మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లో నే వుంటుంది ఎంటి వదినా..అంత పని ఎం వుంటుంది మీ ఇంట్లో...

హా...పనా పాడా...ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తు కూర్చుంటుంది...ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది గంటలు గంటలు...లేదంటే ఫోను...


వామ్మో ... ఫోనే...ఫోన్ పట్టుకొని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి...మా అత్తయ్య అయితే చడమాడ అరుస్తారు..మీరు కాబట్టి అమృత అల సాగిస్తుంది...


.అంతెనే పిల్ల...మా సుపుత్రుడు కూడా దానికి వత్తాసు పలుకుతూ వుంటాడు... పాలు ఇచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయి వయసు వచ్చాక మోకాళ్ళ నొప్పులు వస్తాయి ఇంకా ఎదో అవుతాయి అని .. పాలు, బాదం పప్పులు,పండ్లు, హర్లిక్స్ లు అని ఏవేవో తెచ్చ్పెడతాడు...అన్ని తిని కొవ్వు పెరిగి లేని పోని రోగాలు వస్తాయి అంటే వినడు...నాకెందుకు వాళ్ళ కర్మా..చెపితే వినకపోతే నేను ఎం చేసేది....మొన్న సినిమా కి వెళ్లి వచ్చారు .కొత్తగా పెళ్లి అయినట్టు ఈ సినిమాకు షికార్లకు ఎందుకో...డబ్బులు పోగు చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు విల్లు హ్మ్మ్....అని విసుగు గ అంది...

అవి వింటు వుంటే తన మనసు ఇంకా ముక్కలు అయిపొద్ధి అని ముందుకు కదిలింది అమృతా...తనని చూడగానే అందరూ నిశబ్దంఅయిపోయారు..

అమ్మ అమృత బాగున్నావా....నీ గురించే మాట్లాడుతున్నారు అక్క గారు...నీ చేతి వంట నీ పేరు లాగానే అమృతం ల వుంటుంది అని అంటున్నారు...ఇదిగో నువ్వే వచ్చావు...నూరేళ్ళు తల్లి నికు...

థాంక్స్ చిన్నమ్మ...అత్తయ వంట ఎం చేయమంటారు చిన్న స్వరం తో నెల వైపు చూస్తూ అడిగింది...


పప్పు వద్దు అమ్మ గ్యాస్ అవుతుంది...మోకాళ్ళ నొప్పులు వున్నాయి కదా...వంకాయ కూర కూడా వద్దు..బెండకాయ వేపుడు చేసేయి...నీ ఇష్టం అని అనింది...


సరే అని అక్కడి నుంచి వచ్చేసాక... నేను ఎంత బాధ పడింది నాకు మాత్రమే తెలుసు...అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా...గదిలో ఉన్న ప్రైజ్ లను ఫోటో లను చూస్తూ వుంటే వాటిని మరిచిపోలేను...అందుకే అన్ని తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నా... నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా...ఆనందం గా వున్న రోజులు గుర్తుచేసుకుని సంతోషించి వుండడానికి డైరీ..మరి ఇప్పుడు డైరీ రాయడం ఇప్పుడు అవసరమా...అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణి గా మిగిలి పోతాను....కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు...


చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు....


రెండు రోజుల తర్వాత......

అమృతా......


ఎంటి అండి...


ఒక సారి లే...


బారం గా నిద్ర లేచి చూసింది అమృత...హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు...


ఎందుకు అండి డబ్బులు వృధా చేస్తారు..


హ్మ్మ్.....ఆగు....అటు చూడు అని గది వంక చూపాడు...తన చిన్న నాటి నుంచి తనకు జరిగిన అద్భుత సంఘటనలు అన్ని గోడలపై పెద్ద పెద్ద ఫ్రేము లలో అమర్చ బడ్డాయి...తనకు వచ్చిన ప్రైజ్ లు సెల్ఫ్లో వున్నాయి....వాళ్ళ అమ్మ నవ్వుతున్న మొహం తో లగేజీ బ్యాగ్ తో తనను ఇంటికి తీసుకొని వెళ్ళడానికి నిలుచొని వుంది....


ఆశ్చర్యం తో చూసింది ఆదిత్య వంక....


చిరునవ్వే సమాధానం గా బదులు చెప్పాడు ఆదిత్య....


పెళ్లి కి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమికుల రోజున చూపిన ప్రేమ కంటే...ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకొని చూపిన ప్రేమ నిజమయిన ప్రేమ ల అనిపించింది అమృత కి..ప్రేమతో నిండిన కనులతో ఆదిత్య నీ హగ్ చేసుకుంది అమృత....


Rate this content
Log in

Similar telugu story from Drama