STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy

3  

Dinakar Reddy

Abstract Comedy

బారిష్టర్ బాబు

బారిష్టర్ బాబు

1 min
293

ఈ అరవ మనిషి ప్రపంచమంతా ఎరిగినట్లు మాట్లాడుతున్నాడు. అయినా నా బొంత గురించి ఆయనకెందుకో. ఇంకా నయం నా నారింజపండు రంగు శాలువా చూశాడు కాదు.


పొద్దున్నే నేను లేచే సరికి ఈ బొంత లేకపోతే అనే అనుమానం కలిగింది. అందుకే నేను జాగ్రత్తగా నా బొంతను పట్టుకుని కునికిపాట్లు పడుతూ ఏదో నిద్రా దేవికి దణ్ణం పెట్టుకున్నాను.


మరుసటి రోజు పొద్దున్న లేచి చూద్దును కదా. నా బొంత భద్రంగా ఉంది. 


ఆ అరవాయన తాపీగా కూర్చుని ఉన్నాడు. రాత్రి నన్ను ఇంగ్లండు వెళుతున్నందుకు ఎగతాళి చేసినందుకు క్షమాపణలు చెప్పాడు.


ఏమైనా అరవ వాళ్లు కూడా మంచి వారే అనిపించింది. ఆ స్టేషనులో ఉన్న ఆయన తప్ప.


అంతలో ఎవరో అరుస్తున్నారు. కొలంబో వెళ్లే వాళ్ళంతా ఇక్కడ దిగండి అని.


కళ్ళు నులుముకుని చూస్తే ఆ అరవ మనిషి లేడు. నా బొంత మాత్రం ఉంది. ఏదో కల వచ్చిందని కాసిన్ని నీళ్ళు తాగి సామాను అంతా తీసుకుని రైలు నుంచి బయటకు దిగాను.


అయినా రేపు ఎప్పుడైనా నేను ఇంగ్లండులో బారిష్టర్ చదివి భారత దేశానికి తిరిగి వచ్చి మళ్లీ రైలు ఎక్కితే ఆ అరవ పెద్ద మనిషే కనిపిస్తే అప్పుడు చూసుకోవచ్చు అని వదిలి వేశాను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract