అత్తింట అమ్మ
అత్తింట అమ్మ


******
అమృతా.... అంటూ పిలిచిన అత్తమ్మ పిలుపుతో వంట గది నుండి బైటికి వచ్చి..
అత్తమ్మ...మహాలక్ష్మీ కి కాఫీ అందిస్తూ..
చెప్పమ్మా అంది అమృత.
ఆమృతా... నీకెన్నిసార్లు చెప్పాలమ్మా...పెళ్లై ఇంకా నాలుగు నెలలు కాలేదు..అప్పుడే వంటా..వార్పు అనకుండా చక్కగా నీ భర్తతో..ఎంజాయ్ చేయమని చెప్పానా..
వంటమనిషి ఉందిగా..ఇవన్నీ నీకెందుకంటే వినవెందుకే...అంది ప్రేమతో కూడిన కోపంతో మహాలక్ష్మీ..
అమ్మా.. నువ్వెంత చెప్పినా తను వినదు...
"అమ్మ సర్పంచ్ గా ఈ గ్రామానికి రాత్రానక పగలనక ఏంతోసేవ చేస్తున్నారు...ఆమె ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనదే, వంటవాళ్లను నమ్ముకుంటే ఎలా..వేళకు మంచి ఆహారాన్ని అందిస్తేనే... అమ్మ ఆరోగ్యంగా వుంటుంది...ఇప్పుడు సుఖ పడాల్సింది...మనం కాదు అమ్మ అంటుంది",
నీ ముద్దుల కోడలు అన్నాడు అరవింద్ కంప్లైంట్ చేస్తున్నట్లుగా.
అవునటే...పిచ్చిపిల్లా...రా ఇలా కూర్చో అంటూ..తలపై చెయ్యి వేసి అమృత నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టింది మహాలక్ష్మీ..
ఏమోరా ...ఈ పిల్ల వచ్చినప్పటినుండి...ఇంటి బాధ్యతoతా తానే చూస్తుంది,
అన్నీ తానయి అందరికి ఏoకావాలో చూస్తుంది, నా బంగారు తల్లి..
దీని రాకతో మన ఇంటికి కొత్త కళ తెచ్చిందిరా... సంతోషంగా ,ప్రశాంతంగా ఉండడంతో ఇప్పుడు నా ఆరోగ్యం కూడా చాలా బెటర్ అనిపిస్తుంది.
ఇది మన ఇంటి దేవతరా అంది మహాలక్ష్మి ఆమృతను దగ్గరగా తీసుకొని మురిసిపోతూ...
అమృతా... నీకు నా ఆరోగ్యమే కదా ముఖ్యం, అయితే ఒక పని చెయ్యవే..
నా చేతిలో త్వరలో..
ఓ మనమరాలిని పెట్టు..చక్కగా దానితో ఆడుకుంటూ..ఆరోగ్యాంగా ఉంటాను..సరేనా..అంది అమృత చుబుకాన్ని చేయితో పైకి లేపుతూ..మహాలక్ష్మి.
పొ అమ్మా... మీరు మరీనూ... అంటూ సిగ్గుతో కిచెన్ లోకి పారిపోయింది అమృత.
మహాలక్ష్మి..అరవింద్ ఇద్దరూ.. పక.. పకా..నవ్వుకున్నారు..
వెనకాలే...కిచెన్ లో కి వచ్చిన అరవింద్..అమ్మ చెప్పింది విన్నావుగా..ఓవర్ టైం డ్యూటీ కి నేను రెడీ అంటూ.. ఆమృతను ..గట్టిగా తన కౌగిలిలో బంధించి అదరామృతాన్ని..ఆస్వాదించాడు..
అది తనకు ఇష్టాంగానే ఉన్నా..పట్టపగలు..అందరూ చూస్తారనే స్ప్రుహ రాగానే అరవింద్ ను బలంగా నెట్టివేసి.. దూరంగా పారిపోయింది అమృత.
ఆనందం...వెల్లివిరుస్తన్న ఆకుటుంబానికి ఏ దిష్టి తగిలిందో...ఏమో కాని, పెనువిషాదాం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది..వూహించని ఆ సంఘటన ఆ కుటుంబాన్ని అతలా కుతలం చేసింది.
ఒక రోజు పొరుగు వూరికి వెళ్లి వస్తున్న అరవింద్...రోడ్ యాక్సిడెంట్ లో...చనిపోయాడు.
ఎంతో..కష్టం... ఎవరూ తీర్చలేని వేదన, తలకొరివి పెట్టాల్సిన కొడుకు కళ్ళముందే కానారాని లోకాలకు కనపడకుండా వెళ్ళాపోయాడు ..
ఏ అచ్చట ముచ్చట తీరకముందే...అభం శుభం తెలియని కొత్త పెళ్ళి కూతురు అమృత జీవితం మోడువారిపోయింది.
అమృత...అమ్మా..అమ్మా అంటూ...తనను పట్టుకొని ఏడుస్తుంటే...మహాలక్ష్మి గుండె చెరువయ్యింది...
భర్తను చూపిస్తూ...బావ చూడమ్మ.. ఎంతలెమ్మన్నా లెవట్లేదు , నువ్వన్నా చెప్పమ్మా... నువ్వు చెపితే బావ లేస్తాడమ్మ... లెమ్మని చెప్పమ్మా అంటూ అమాయకంగా ఆమృత రోధిస్తుంటే...వచ్చిన వాళ్లంతా కన్నీరు మున్నీరయ్యారు.
మొగదిక్కు లేని సంసారమైనా ఊర్లో స్సర్పంచ్ గా తనకున్న మంచితనంతో...ఊరి వారంతా.. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు.
పుట్టెడు దుఖఃo దిగమింగి,గుండె రాయి చేసుకొని కార్యక్రమాలన్నీ...పూర్తి చేసింది మహాలక్ష్మి.
రోజులు..బారంగా గడుస్తున్నాయి... అందరూ జీవశ్చవాల్లా ఎదో బ్రతుకుతున్నారు....
ఆమృత.. తండ్రి ఒకరోజు దైర్యం చేసి ...
అక్కయ్య... అమృతను మావెంట తీసుకెళతాము అని అడిగాడు...
మహాలక్ష్మి..గుండెల్లో బాధను దిగమింగుకొని ..అలాగే మీ ఇష్టం అంది...
ఈ మాట విన్న ఆమృత.... తండ్రి పై.. నిప్పులు చెరిగింది.
ఇక నాకు తల్లి అయిన..తండ్రి అయినా...ఈ అమ్మే అని..తనను వదిలి పెట్టి ఏ పరిస్థితిలోనూ..రాలేనని తెగేసి చెపుతూ...
ఒక్కసారిగా...వెళ్లి మహాలక్షిమి ఒడిలో గువ్వలా ఒదిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది..
మహాలక్మి కూడా..మాట్లాడే దైర్యం చేయ లేక పోయింది.
ఇక చేసేది లేక అమృత తల్లి దండ్రులు...కన్నీళ్లు పెట్టుకుంటూ...ఇక నీదే..భారం అంటూ..మహాలక్ష్మి చేతులు పట్టుకొని..బిడ్డ జాగ్రత్తమ్మ..అని చెప్పి వెళ్లిపోయారు.
రోజులు..వారాలు..నెలలు కాలం అనేక తీపి..చేదు జ్ఞాపకాలను మిగుల్చుతూ... సాగిపోతుంది.
ఆనందంతో..ఉన్నప్పుడు కాలం ఎలాగడుస్తుందో అర్థం కాదు..ఒక సంవత్సరం కూడా..క్షణంలా..గడిచి పోతుంది..
కానీ అదే కాలం విషాదంలో..ఒక్కోక్షణం ఒక్క యుగంలా గడుస్తుంది.
కానీ కాలానికున్న గొప్పతనం ఏంటంటే గాయలన్నింటిని..మాన్పి వేస్తుంది...
మరిచిపోలేకపోతే మనిషికి భవిష్యత్ ఉండదనేమో...
ఈ గాయాలన్ని మాన్పి ఎలాగైనా మళ్ళీ తన ఇంటికి కొత్త సంతోషాల్ని తీసుక రావలనుకుంది మహాలక్ష్మి .
తానుండగానే..అమృతకు ఒక మంచి జీవితాన్ని అమ్మ స్ధానంలో నిలబడి అందించాలని ధృడంగా అనుకుంది.
ఎలాగైనా..ఆమృతను మళ్ళీ పెళ్లికి ఒప్పించాలనుకుంది..
కానీ ఇది అంత తేలికైన వ్యవహారం కాదు.
ఊరివాళ్ళ వ్యతిరేకతను,కులం, మతం అనే చాందస వాదుల మూర్ఖత్వాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే వూహించింది.
అందుకే..అందరి సలహాలు అడిగి ఇబ్బంది పడటం కన్నా తన నిర్ణయాన్ని అందరికి చెప్పి..ఒప్పించాలనుకుంది.
ఓకరోజు తన నిర్ణయాన్ని..ఊరి వాళ్ళ ముందు ప్రకటించింది...కానీ దీనిని చాలామంది వ్యతిరేకించారు..
కానీ ఊరి మహిళలంతా.. మహాలక్ష్మి ని సమర్థించారు .
నీ వెంటే మీముంటామని గట్టిగా చెప్పారు..
కొద్దిరోజుల్లోనే మహాలక్ష్మిని సమర్థించే వాళ్ల సంఖ్య పెరిగింది..
ఇక కుల మత పెద్దలు ఇష్టం లేకపోయిన..ఊరి మాటను కాదని లేక పోయారు.
అమృత తల్లి దండ్రులకు కూడా ఎన్నోవిదాలుగా నచ్చచెప్పి..ఒప్పించింది మహాలక్ష్మి.
ఇక మిగిలింది అమృత..అన్నింటికన్నా ఇదే కష్టమైన పని....కానీ ఎలాగైనా ఒప్పించాల నుకుంది మహాలక్ష్మి.
ఒక రోజు ఉదయమే అమృతను మెల్లగా కదిలించింది..కానీ అమృత రియాక్షన్ కు మహాలక్ష్మి నెవ్వరపోయింది.
అమ్మా.. నేనంత బారమైయ్యాన నీకు నువ్వు..నన్ను ఇంట్లోనుండి వెల్లగొట్టాలనుకుంటున్నావా అమ్మ...
కనీసం ఒక పనిమనిషిలా కూడా ఈ ఇంట్లో వుండటానికి పనికిరానా అమ్మా అంటూ...బోరుమని ఏడ్చింది.
మహాలక్ష్మి కి కూడా దుఃఖం కట్టలు తెంచుకుంది.
కాస్త తెరుకున్నాక...
అది కాదే నాకు వయసు పై పడుతుంది నిన్నిలా చూస్తూ నేను ప్రశాంతంగా ఉండలేక పోతున్నానే..
పైగా.. వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా ఉంటే వచ్చే ఇబ్బందులెన్నో నీకు తెలియదే.. ,
బ్రతకడం కన్నా ఒక్కోసారి సూటిపోటి మాటలు..ఆకలి చూపులు తట్టుకోవడం కష్టమే అని నచ్చ చెప్పింది..
లోకం వేసే నిందలు భరించలేవు తల్లి అని వివరించింది..
భవిష్యత్ఎలా ఉంటుందో..స్నేహితురాలిగా విడమరిచి చెప్పింది...
తల్లిలా అనునయించి చెప్పింది.
అమ్మ ఇలాంటి పాడు లోకంలో నీనుoడలేను...
మా అమ్మతో ఉండాలన్నా ఇన్ని బాదలైతే నాకి బ్రతుకే వద్దు, కాస్త విషం ఇవ్వమ్మా...నీ ఒడిలో హాయిగా చచ్చిపోతానని..ఏడ్చింది అమృత.
మహాలక్ష్మి అమృతను తన ఒడిలో పడుకోపెట్టుకొని...
అమ్మా ఈ జన్మలో..నాకు నీ బిడ్డలతో ఆడుకునే అదృష్టం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు బ్రతకాలి?..
ఎవరికోసం బ్రతకాలి? నాకు నా జీవితం పట్ల విరక్తి కలుగుతుంది...చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ కన్నీరు పెట్టుకుంది..
అమృత టక్కున అమ్మా ఏం మాటలవి ..అంటూ చేతిని అడ్డిగా పెట్టి మహాలక్ష్మి నోరుమూసింది.
సరే నమ్మా నీ ఇష్టం....
కానీ నాతల్లి స్థానంలో నువ్వే నా పెళ్లి చేయాలి...
నా పుట్టిల్లు కూడా ఇదే..
నువ్వు నాతోనే ఉంటానని మాటివ్వమంటూ మహాలక్ష్మి చెయ్యిని తన తలపై పెట్టుకుంది.
అలాగే లేవే పిచ్చిదాన..అంటూ అమృతను గుండెలకు హత్తుకొని సంతోషoగా...ఆనంద భాష్పాలు రాల్చింది మహాలక్ష్మి.
మహాలక్ష్మి... తమ బంధువులలో.... యోగ్యుడైన అబ్బాయితో అమృత వివాహం రంగ రంగ వైభవంగా జరిపించింది...పుట్టింటి మర్యాదలన్ని...స్వయంగా దగ్గరుండి జరిపించింది...
ఊరి వాళ్ళంతా తమ అడపడుచులా భావించి అమృతను దీవించి సాగనంపారు...
వూరంతా...ఆడంబరంగా అమృత వెనుక సారెతో కదిలింది..మొదటి సారె... పెళ్ళికొడుకు ఊరులో ఉంటే చివరి సారె... పెళ్ళిమండపంలో కదిలింది ..
అమృతకు... అత్తమ్మే..అమ్మ య్యిoది..ఆన్నీ ముచ్చట్లు దగ్గరుండి తీర్చింది.
సంవత్సరం తిరగకుండానే..అమృత పండంటి కొడుకును అమ్మ చేతిలో పెట్టింది...
బిడ్డను ముద్దాడి అత్తింటి అమ్మ.. మహాలక్ష్మి ఎంతగానో మురిసిపోయింది..
మళ్ళీ ఆ ఇంటికి కొత్త కళ వచ్చి .. కళ కళ లాడింది.
*******