STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

అసలేం గుర్తుకు రాదు..

అసలేం గుర్తుకు రాదు..

1 min
609

చింటూకి మార్కులు బాగా తక్కువ వచ్చాయట. పక్కింటావిడ గోడ మీదుగా పలకరించింది. 


సరిపోయింది. విషయం ఈవిడ చెవిన పడితే ఇక టీవీలో న్యూస్ చెప్పినట్లే చేస్తుంది అనుకుంది లావణ్య.


మా చింటూకి మ్యూజిక్ నేర్పిస్తున్నాం వదినా. మీ అన్నయ్యకి చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవడం కుదర్లేదట. అందుకే ఇప్పుడు చింటూకి నేర్పిస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. అందుకే మార్కులు తగ్గాయి. ఇంకొన్ని రోజుల్లో చదువూ ఇంకా సంగీతం రెండింటినీ బాలెన్స్ చేసేస్తాడు చూడండి అని కవర్ చేశాను.


మావాడని కాదు గానీ వాడు పాడితే వినడం కంటే రిమోట్ తో తల బాదుకోవడం మేలని మా శ్రీవారు మెచ్చుకుంటూ ఉంటారు.


అప్పుడే చింటూ క్రికెట్ బ్యాట్ పట్టుకొని పక్కింటావిడ కొడుకు శీనుతో కలిసి వచ్చాడు.


అరే. వచ్చేసాడే సరిగమల దిట్ట. చింటూ! ఓ పాట పాడు బాబూ అంది పక్కింటావిడ.


నేను ఇబ్బందిగా చూసి వాడి వైపు తిరిగి సైగ చేశాను.


అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు.. అంటూ వాడు పాట అందుకున్నాడు.


నిజమే. పరీక్షల్లో కూడా ఏమీ గుర్తుకు రాదు అని నేను తల పట్టుకున్నాను.


పక్కింటావిడ కు మాత్రం వాడు పాట పాడుతుంటే నచ్చేసింది. మా శీనుని కూడా మ్యూజిక్ క్లాసులో చేర్పిస్తాము. ఎంచక్కా ఇద్దరూ వెళ్లి నేర్చుకుంటారు. కాస్త ఆ సంగీతం టీచర్ ఫోన్ నంబర్ ఇవ్వు వదినా అంది పక్కింటావిడ.


నేను నవ్వలేక నవ్వాను.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract