అశ్రు నివాళి
అశ్రు నివాళి


మన దేశం లోపలి రక్షకులు, రక్షక భటులు. వారు మనను మన దేశంలోని ముష్కరుల నుండి కాపాడడానికి రేయింబవళ్ళు కష్ట పడతారు.
100 కోట్లు దాటిన మన జనాభాని కాపాడడానికి దాదాపుగా కోటి మంది రక్షక భటులు తమ ప్రాణాలను పణంగా పెట్ఠి మనను కాపాడడానికి యత్నిస్తున్నారు. అయినా ఎక్కడో అక్కడ, ఏవో కొన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటికి కారణం పూర్తిగా రక్షణ శాఖ వైఫల్యమేనా లేక మనవారి
నిర్లక్ష్యము, మనుషుల్లో పెరిగిన పశు ప్రవృత్తి కూడా కారణమా.
ఇప్పుడు ఇదంతా అప్రస్తుతం గా అనిపించవచ్చు. కానీ ఆ రక్షక భటులు ప్రజలను కాపాడే ప్రయత్నంలో తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలకు దారి తెన్నూ ఉండదు. మనవారు మనకు దూరమైతే మనమెంత బాధ పడతామో, వారు కూడా అంతే కదా. వారు ఈ దేశంలో ప్రజలే కదా. పాపం
వారిని ఆదుకొనేది ఎవరు? మనలాగే వారి కుటుంబ పరిస్థితులు
తారుమారు అవుతాయి కదా.
దేశం సరిహద్దుల్లో మన సైనికులు నిత్యం తుపాకులతో దీపావళి, రుధిర ధారలతో హోళీ చేసుకుంటున్నారు.
వారి కుటుంబాలకు క్షేమ సమాచారాలు కూడా తెలియని క్లిష్టమైన పరిస్థితి. వచ్చింది కబురు, వెళ్ళింది కబురు అన్నట్లుగా సరిహద్దుల్లో సైనికులు, దేశంలో పలుచోట్ల వారి కుటుంబాలు
ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకులు సాగిస్తున్నారు.
సరిహద్దుల్లో సైనికులు ఎంతో అప్రమత్తంగా ఉండబట్టి మన దేశ ప్రజలమంతా నిశ్చింతగా, సంతోషంగా బ్రతుకు సాగిస్తున్నాము.
దేశంలోని రక్షక భటులకు, సరిహద్దుల్లోని సైనికులకు మనం అంతా ఎంతో ఋణపడి ఉన్నాం. వారికి మనం చేయగల సహాయం, సాధ్యమైనంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండడం.
కర్తవ్య నిర్వహణలో అమరులైన రక్షక భటులకు, సైనికులకు, వారి కుటుంబాలకు మనం ఏమిచ్చి ఋణం తీర్చు కోగలం.
మనస్ఫూర్తిగా వారికి మనం ఇవ్వ గలిగినది అశ్రునయనాల తో
నివాళులు అర్పించడం తప్ప.
కర్తవ్య నిర్వహణలో అమరులైన మా రక్షక భటులకు
సరిహద్దుల్లో అహర్నిశలు శ్రమించే మా సైనికులకు
అశ్రు నివాళి.