Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

Dinakar Reddy

Abstract Drama


4  

Dinakar Reddy

Abstract Drama


అపరిచితులతో..

అపరిచితులతో..

2 mins 322 2 mins 322

సాగర్ నువ్వు పెద్ద hypocrite రా అన్నాడు వైభవ్. ఎందుకురా అని అడిగాను నేను. మొన్న erotic chat websites గురించి ఆర్టికల్ వ్రాసిచ్చావు. అవునా? అని అడిగాడు వైభవ్.


వైభవ్ నేనూ ఇద్దరం కంటెంట్ క్రియేషన్ చేస్తున్నాం ఒకే కంపెనీలో. న్యూస్ ఛానెల్స్ కి ఆన్లైన్ సైట్స్ కి మేము ఇచ్చే కంటెంట్ బాగా పాపులర్ అవుతోంది. ఒకే ఇన్స్టిట్యూట్ లో మీడియాకు సంబంధించి కోర్స్ చేయడం వల్ల ఏరా పోరా అనుకునే స్నేహం కూడా ఉంది.


ఇద్దరిలో ఎవరం ఆర్టికల్ వ్రాసినా ఒకరు వ్రాసింది మరొకరు ఎడిట్ చేసి చీఫ్ ఎడిటర్ మానసకి పంపించే వాళ్ళం.


అవున్రా పంపాను. నీకు కావాలనే చెప్పలేదు అన్నాను నేను ఆరెంజ్ జ్యూస్ సిప్ చేస్తూ.


నీ మొహం. అసలు టైటిల్ ఏం పెట్టావ్." సరదానా? నాగరిక వ్యభిచారమా? " అనా. అసలు దానికి అర్థమన్నా తెలుసా నీకు. తెలిసే పెట్టుంటావ్. ఆ పాత తెలుగు నవలలు వద్దన్నా వినకుండా చదివి ఇలా తయారయ్యావ్ అని వాడు అరిచి సీట్లో కూర్చున్నాడు.


అదొక్కటే చదివావా నువ్వు. సైబర్ సెక్స్ అడిక్షన్ డిసార్డర్ గురించి కూడా వ్రాశాను. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చాను. దాని గురించి ఏమీ అనవా అన్నాను నేను.


సరేరా. ఘనకార్యం చేశావు. ఏదో ఒంటరిగా అనిపించి పార్టనర్ లేకనో బయటికి వెళ్ళలేకనో కొంత మంది ఆన్లైన్ సైట్స్ లో అపరిచితులతో శృంగార అనుభవాన్ని పొంది సంతృప్తి పొందుతున్నారు. దాన్ని నువ్వు నాగరిక వ్యభిచారం అనే మాట వాడి న్యూస్ ఛానెల్స్ కి ఇచ్చావు. ఇక వాళ్ళు ఎవర్నో టార్గెట్ చేసి ఆ సంభాషణలు లీక్ చేయించి పైన స్పాన్సర్ పేరు పెట్టి రోజంతా చెబుతారు. దాని గురించి ఏమంటావ్ అని బాల్కనీలో మొక్కల దగ్గరికి వెళ్లాడు. సిగరెట్ తీసి అంటించి గుప్పుమని గాల్లోకి వదిలాడు.


సరే కానీ ఇక్కడికి వచ్చే సిగరెట్ ఎందుకు కాలుస్తావ్ చెప్పు అన్నాను నేను. 


టాపిక్ మార్చకు. ఇక్కడ అయితే కెమెరా ఉండదు. పైగా సిగరెట్ వాసన లోపలికి రాకుండా ఈ మొక్కల వాసనలో కలిసిపోతుంది. అందుకని అని అన్నాడు వైభవ్.


అంటే నువ్వు చేసేది దాచిపెట్టగలవ్ ఎవరికీ తెలీదు కాబట్టి ఇక్కడికి వస్తున్నావ్. అలానే వాళ్ళూ మేము దాచిపెడుతున్నాం ఎవరికీ తెలీదు అనుకుని అపరిచితులతో చాట్ చేసి ఫోటోలు వీడియోలు షేర్ చేసి ఆ తర్వాత వాళ్ళ చేతుల్లో బ్లాక్ మెయిల్ కాబడి ఎంత మానసిక వ్యథకు గురి అవుతున్నారో తెలుసా. అందుకే వ్రాశాను ఆర్టికల్ అని చెప్పాను.


అయినా ముఖం చూపిస్తూ మాట్లాడమని ఎవడన్నాడు. ఇంటర్నెట్లో మన గోప్యత గురించి కూడా ఆలోచించాలి కదా. అన్ని వ్యక్తిగత విషయాలూ తెలిసేలా మాట్లాడకూడదు. అసలు పర్సనల్ వీడియోలు షేర్ చెయ్యడం అనవసరం అన్నాడు వైభవ్.


అందరూ నీ అంత తెలివైన వాళ్ళు ఉండరు కదా hunkforquickie గారూ అన్నాను నేను.

ఈ పేరెక్కడో విన్నట్టుందే అని కాస్సేపు ఆలోచించాడు వైభవ్.

రేయ్ సాగర్. నువ్వు నా మొబైల్ చూశావా. చంపుతా నిన్ను అని నా వైపు తిరిగాడు.


సర్లేరా. నీ ఐడీ మాత్రమే చూశాను. నీ ఆన్లైన్ ప్రేయసుల వివరాలు చూడలేదులే. రీసెర్చ్ కోసం చూశా అంతే అని పరుగెత్తాను. 


నువ్వు మర్యాదగా తరువాత ఆర్టికల్ ఏం వ్రాస్తున్నావో చెప్పు అని వాడు చేతిలో పెద్ద బాక్స్ ఫైల్ తీసుకుని వెంట పడ్డాడు. 


నేను పక్క క్యాబిన్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి వైబ్రేటర్ తో అనుభవాలు అని వ్రాద్దామనుకుంటున్నారా అని నవ్వాను.

వ్రాస్తారు. వ్రాస్తారు. ఉండు ఎడిటర్ తో చెప్పి నీ తిక్క కుదురుస్తా అని వైభవ్ ఎడిటర్ క్యాబిన్ వైపు వెళ్ళాడు.Rate this content
Log in

More telugu story from Dinakar Reddy

Similar telugu story from Abstract