అమృతం దొరికిందా
అమృతం దొరికిందా
అసలు నీకు బుద్ధే లేదు అని అరిచి మళ్లీ కుర్చీలో కూలబడ్డాడు రమేషు.
లోపల్నుంచి మంగ చపాతీ కర్రను హాల్లోకి విసిరింది. అది కాస్తా వెళ్లి టీవీ అద్దాన్ని పగులగొట్టి కింద పడింది.
పది నిమిషాల క్రితం రమేషు చేసిన ఉలవ చారులో మంగ అతనికి తెలీకుండా కాస్త ఉప్పు ఎక్కువేసింది. అసలు రమేషుకి ఉలవ చారే దేవతలు తాగే అమృతమని ఓ భావన.
చేసిన రెండవ రోజున ఉలవ చారు అన్నంలో కలుపుకుని తింటే స్వర్గం అంచుల్ని చూసినట్లే అని ఓ సిద్ధాంతం కూడా రాద్ధాంతం చేయకుండా వ్రాసాడు.
అలాంటి చారుని తన అనుమతి లేకుండా మంగ తాకడమే. భార్య అయినా సరే చారులో వాటా లేదని అరిచాడు. ఆ కోపానికి సమాధానమే చపాతీ కర్ర.
ఇప్పుడిక టీవీలో కూడా అమృతం లేదా అని ఆదివారం గడియారం చూస్తూ కూర్చున్నాడు రమేషు.
మంగ మళ్లీ చారు వేడి చేసింది.
