STORYMIRROR

Dinakar Reddy

Abstract Fantasy Thriller

4  

Dinakar Reddy

Abstract Fantasy Thriller

అద్భుత వనం

అద్భుత వనం

1 min
372

అనగనగా ఒక వనం. చీమలూ, కాకులూ దూరగలిగినా వాటికి అక్కడ ఉండాలని లేదు. దానికి కారణం అక్కడ ఉన్న మంత్రాల చెట్టు.


ఆ చెట్టు చూడ్డానికి మామూలుగానే ఉంటుంది. ఏదైనా జీవి దాని దగ్గరికి వెళ్ళగానే చటుక్కున దాని కొమ్మలను పెద్దవిగా చాచి ఆ జీవిని పట్టుకుని తొర్ర లాంటి నోటిలో వేసుకుని భోంచేస్తుంది.


ఆ వనంలోని సరస్సుకు వెళ్లాలంటే ఆ మంత్రాల చెట్టును దాటుకునే వెళ్ళాలి. వేరే మార్గం లేదు. పక్షులు ఆ చెట్టు సమీపంలో ఎగిరితే ఆ చెట్టు తన కొమ్మలను పైకి కూడా పంపి బంధించగలదు.


అన్ని జంతువులూ, పక్షులూ కలిసి మోహిని ఉండే గుహ వద్దకు వెళ్లాయి. మోహినికి ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. ఆమె మెడలో కెంపుల హారం ఉన్నంత వరకూ ఆమెను ఎవ్వరూ జయించలేరు.


వనంలోని ప్రాణులను రక్షించడానికి మోహిని మంత్రాల చెట్టు దగ్గరకు వెళ్ళింది. మంత్రాల చెట్టు మోహినిని చూసి ఆమె వైపు తిరిగింది.


మోహిని ముందే చెప్పినట్లు అన్ని ప్రాణులూ సరస్సు మార్గం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాయి. సరస్సు ఆ జంతువులతో పాటు వేరే చోటికి వెళ్లేందుకు సిద్ధపడింది.


అన్ని జీవులూ నీటిలో ఈత కొడుతూ ఆ వనంలో వేరే వైపుకు వెళుతున్నాయి. ఇంతలో మంత్రాల చెట్టు వెనక్కి తిరిగింది. మోహిని మంత్రాల చెట్టును ఆపడానికి కెంపుల హారం తీసి చెట్టును తిరగకుండా ఆపింది.


హారం మెడలో లేని సమయంలో మంత్రాల చెట్టు మోహినిని బంధించింది..


ఈ ఆపద నుండి మోహినిని కాపాడాలని ఆ వనంలోని ప్రాణులన్నీ ఒక నిర్ణయం తీసుకున్నాయి.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract