ఆదివారం సెలవు లేకపోతే
ఆదివారం సెలవు లేకపోతే
ఆదివారం డ్యూటీకి రానన్నావ్.నా కొలీగ్ రాము ప్రశ్న.
నేను ఎప్పుడూ అంటూ ఉండే వాణ్ణి కోటి రూపాయలు ఇచ్చినా నేను ఆదివారం పని చేయను అని.
ఇప్పుడేంటో ఆదివారాలు కూడా పని చేయడానికి ఒప్పుకున్నాను.ఓ నవ్వు నవ్వి రామును డెస్క్ దగ్గరకు పంపించేశాను.
పని చేస్తూ ఉంటే గంటలు గడిచిపోతున్నాయి.ఇంతలో మా అటెండర్ శీనయ్య వచ్చాడు.వయసులో మా కంటే పెద్ద వాడవ్వడం వల్ల ఎప్పుడూ మేం అతణ్ణి బాబాయ్ అని పిలిచేవాళ్ళం.ఏంటి బాబాయ్! ఆదివారం పని చేయడం ఇబ్బందిగా అనిపించదా అని అన్నాను.మరేం లేదు బాబూ! ఆదివారం కూడా పని చేస్తే కాసింత ఎగస్ట్రా డబ్బ
ులు వచ్చినట్టే కదా.
మా అమ్మాయిని ట్యూషన్ పంపించడానికి పనికొస్తాయి.సాయంత్రం ఎలాగూ ఇంటికేగా వెళ్ళేది.అని అన్నాడు.
ఏమో బాబాయ్!వారానికి ఒక్క రోజు అయినా కుటుంబంతో గడపలేకపోతున్నావ్ కదా అని అన్నాను నేను.అందరికీ అలాంటి వెసులుబాటు ఉండదు కదా బాబు.అటు పనీ చూసుకోవాలి ఇటు కుటుంబాన్ని చూసుకోవాలి అని చాయ్ నా టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళాడు శీనయ్య.
అవును కదా.అందరికీ వీక్ ఆఫ్,వీకెండ్ ఇవన్నీ ఉండవు.
ఇలా కుటుంబాన్ని మిస్ అవుతున్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ నేను చాయ్ తాగి మళ్ళీ పనిలో పడ్డాను.