ఆ నలుగురు సినిమాలో..
ఆ నలుగురు సినిమాలో..
రఘురామ్ ఆత్మ బాధ చూడలేక యమ దూతలు అతనికి అరగంట సేపు శరీరంలో ఉండేట్లు శక్తిని ఇస్తారు.
సరిగ్గా శేఖర్ తల కొరివి పెట్టే సమయానికి, రఘురామ్ లేచి కూర్చున్నాడు. అందరూ దెయ్యం, దెయ్యం అంటూ అందరూ వెనక్కు పరుగెత్తుతారు.
రఘురామ్ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడే ఉంటారు.
శేఖర్ తండ్రి చెయ్యి పట్టుకుని, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించద్దు నాన్నా. నన్ను కొట్టండి. నన్ను కొట్టండి అని ఏడుస్తాడు. అంతలో చిన్న కొడుకు డబ్బులున్న బ్యాగ్ పట్టుకుని ఆ డబ్బుని రఘురామ్ చేతికి ఇస్తాడు.
రఘురామ్ చుట్టూ చూస్తాడు. అతను డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాడు.
వాళ్ళు తీసుకోమని చెప్పినా వినిపించుకోడు. తన భార్య వైపు చూస్తాడు. భారతి అతని దగ్గరికి వచ్చి నాకు అన్యాయం చెయ్యొద్దు అని అంటుంది.
భారతీ! మన పిల్లలు ఏదో ఆవేశంలో తొందరపడ్డారు. అంతే. డబ్బు కంటే మనుషులు, వారి మనస్సులోని కరుణ గొప్పదని తెలుసుకున్నారు.
ఇక నేను వెళ్ళిపోతాను అంటూ శరీరాన్ని విడిచిపెడితాడు. ఇప్పుడు అతని ఆత్మకు ఆ యమ దూతలు దేవ దూతల్లా కనిపిస్తున్నారు.
