STORYMIRROR

Charan pangi

Drama

4  

Charan pangi

Drama

యుగం

యుగం

1 min
405

సత్యం వీడిన ప్రపంచం

ధర్మాన్ని కాపాడిన యుగాంతం

ఎటు వైపో తెలియని ప్రయాణం

జీవన ధర్మాన్ని చూపిన మత్స్యం


గర్వాన్ని మింగిన బ్రాహ్మణుడు

భూ బిడ్డను ఎత్తుకెళ్లిన చోరుడు

ఆ శివ భక్తుడ్ని వధించిన రాముడు

దష్ట సంహారం చేసిన మహా పురుషుడు


సభ లో జరిగిన అధర్మం

అన్నా దమ్ముల మధ్య భీకర యుద్ధం

గొల్లవాడు చేసిన ధర్మ సంస్థాపనం

ధర్మజుడు చేరెను కైలాసం


చిన్నవాడిని దోచుకునే పెద్దవాడు

మాయ మాటలు చెప్పే బాబాగాడు

అహం తప్ప మనం తెలియని యువకుడు

ఎక్కడ ఉన్నాడు ధర్మాన్ని కాపాడే కారణజన్ముడు (కల్కీ)?



Rate this content
Log in

More telugu poem from Charan pangi

Similar telugu poem from Drama