STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

యోగా

యోగా

1 min
3


శారీరక బాధలన్ని..మాన్పేదే యోగా..! 

మనశ్శాంతి ప్రసాదాన్ని..పంచేదే యోగా..! 


శ్వాసమీద ధ్యాసపెట్టి..ఆగుటచే సాధ్యము.. 

సౌందర్యం ఆరోగ్యం..నిలిపేదే యోగా..! 


ఆసనాలు ఏవైనా..చేయునెంతొ సాయము.. 

ప్రాణదీప రహస్యాలు..తెలిపేదే యోగా..! 


స్వస్వరూప సంధానము..జరిగేనా చక్కగ.. 

జీవులన్ని సమమేనని..చాటేదే యోగా..! 


నాడీమండల శుద్ధికి..తోడ్పాటును ఇచ్చు.. 

ప్రాణాయామ హితమేదొ..చూపేదే యోగా..! 


కణకణమున దాగియున్న..విశ్వాలను చూపు.. 

గాలిలోన తేలునట్లు..చేసేదే యోగా..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics