STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఉల్లాసం

ఉల్లాసం

1 min
5


గజలంటే మరల మరల..పాడుకోగ మిగలాలోయ్..!
గుండెపట్టి కుదిపేసే..మెఱుపునదిగ పొంగాలోయ్..!

ఆకలిదప్పుల సంగతి..మరిపించే ముచ్చటేది..
ఉత్సుకతకు ఊపిరయే..ఉల్లాసం పంచాలోయ్..!

ఆషామాషీ వ్యవహారం..అనుకుంటే పొరపాటే..
అనుభవాల రంగరింపు..ఇంపుగాను జరగాలోయ్..!

భావనలే పదునెక్కగ..పండించే ప్రతిన తోడు..
వస్తువేది అయితేనేం..అలవోకగ ఒదగాలోయ్..!

గోడలపై చెక్కుకోగ..నాల్కలపై నాట్యమాడ..
ప్రతి షేరొక చమత్కార..సందేశం కావాలోయ్..!

విశ్వ ప్రేమ తత్వానికి..అద్దమంటె కవి హృదయం..
అక్షరాల గగనాలను..చెలిమిమీర చూపాలోయ్..!



Rate this content
Log in

Similar telugu poem from Classics