STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

తొలకరి

తొలకరి

1 min
10



మబ్బులు మాట్లాడుకుంటున్నాయి ముద్దు ముద్దుగా
మట్టి తల్లి ఒడిలో కరిగిపోదామని కదిలాయి
తొలకరి పిలుపుతో దుమ్ము దులుపుకున్న తరువులు
చంటి పిల్లల్ని కావలించుకున్నట్లు పులకరించింది పుడమి
చినుకు చినుకు తనలో లీనమౌతుంటే
మట్టి పరిమళం మత్తుగా గమ్మత్తుగా ఆహ్లాదంగా
మెత్తబడిన అది విత్తనాలకు అభయమిచ్చింది
మట్టిలో మట్టి కానివ్వనని చేసింది ప్రతిజ్ఞ
ఎండల ఆగడాలకు మొదలైంది శిక్ష 

తొలకరి వానలు తోవ చూపిస్తే
ఆకాశం పంపింది మేఘసందేశం
బతుకు అర్థం అన్నింటిని బతికించడమేనని
మట్టి.. తడి కోల్పోక ముందే, దుమ్ముగా మారకముందే
వానా వాన వల్లప్ప పాటలు పాడాయి మబ్బులు కిందికొచ్చి
మొలకలు, మొక్కలు, చెట్లు స్నానాలు చేశాయి తనివి తీరా
బలం మందులు తాగినట్లు అన్నింటి ముఖంలో కళ
చిగురుటాకులతో జీవం పోసుకున్నాయి 

ధరిత్రి తీసుకుంది పచ్చని సంకల్ప దీక్ష
పసరిక పాకింది మట్టి పాదాలు కనిపించకుండా
రాళ్లు, రప్పల, కొండలను వదిలిపెట్టకుండా ఆక్రమణ
సందు దొరికిన చోటల్లా తలెగరేశాయి మొక్కలు
పశువులకు పరమాన్నంలా మేత
రైతుల కళ్ళల్లో ఆశల వెలుగుల మోత
ఇంద్రధనస్సులు వచ్చిపోతున్నాయి వీవీఐపీల్లా 

నేల పులకింతతో తీరింది నీటి గోస
ఎన్నెన్నో జీవుల జననం సృష్టికారుడు వేసిన కొత్త చిత్రాలు
అడవులు సైన్యాన్ని విస్తరింపజేశాయి నలుదిశలా
ఎండుటాకులు ఎరువులుగా మారడానికి ప్రాణార్పణం
భూమి కనే పరువపు కలలకు లేదు విరామం..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics