STORYMIRROR

Sunkara Hrao

Drama

3  

Sunkara Hrao

Drama

తీర్చ లేమమ్మ ని ఋణం

తీర్చ లేమమ్మ ని ఋణం

1 min
204

జన్మించిన ప్రతిప్రానణికి తొలి శ్వాస అమ్మ

కానరాదు యే యుగాన అమ్మలేని మరో జన్మ

అమ్మంటే బ్రతుకు బ్రతుకుల వారధి

అనంత ప్రేమానురాగాల సారధి

అమ్మపట్టిన స్తన్యం నా అడుగు అడుగున సైన్యం

అమ్మపాడిన జోల నా అనణువణువునా జ్వాల

అమ్మ వడి ప్రేమ తడి ప్రతి శిశువుకు బ్రతుకు బడి

అమ్మ త్యాగం నాకు భాగ్యం శత వర్షాల వడి

అమ్మ పాదం జన్మనాదం ఒరుల కందని బ్రతుకు వేదం

తనువు పంచి పేగు తెంచిన అమ్మ త్యాగం అనల్పం

ఎన్ని పూజలు యెన్ని సేవలు చేసినా దాని ముందవి అల్పాతీ అల్పం

క్షీర సాగర మధన మందు పుట్టిన అమృతం అల్పం

అమ్మ మనసు ప్రేమ పొరల పొంగిన అమ్మ తనం అనల్పం

చావు బ్రతుకుల ప్రసవ సంధ్యలో జన్మనిచ్చిన త్యాగ శీలివి

నీపాదాల క్రింద పూ రెమ్మనై వాలినా

నీవు పోసిన ఉసురు నిచ్చి నీ పాదాలముందు రాలినా

తీరదమ్మ మాతృ ఋణం

తీర్చ లేదమ్మ యే తరం. ****


Rate this content
Log in

Similar telugu poem from Drama