స్నేహమూ
స్నేహమూ
కలతించిన నిముసమునా ఓదర్చేది స్నేహమూ
కలహించిన మది నెంచక సాగేదే స్నేహమూ
పరిచయాలు పలువురితో ఉంటాయి అందరికీ
స్నేహితులూ కొందరనీ తెలిపేదే స్నేహమూ
మనసారా మాటలాడి తవిదీర కన్నీరు నించు
గలగలమని నవ్వులనది పొంగి పొరలు స్నేహమూ
మదిని పరిచి తలపు తెరచి వలపు పంచు
హృదిని శాంతి చేకూర్చును మన మైత్రీ భావమూ
మన జీవన ఎడారి లో దారి కానరాక నిలచిన
కలల బిడారులకు మనను నడిపించు వాడే నేస్తమూ
రాళ్ళు ముళ్ల జీవదారిలో అండగా దరి నిలిచీ
మైత్రీ ప్రేమ మనుగడను శ్వాసించేదే స్నేహామూ