STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

పలికే వారుంటే

పలికే వారుంటే

1 min
278

చిరాకులన్నీ తీరేలా

మరలా ఆశలు మోసులు వేసేలా

కాస్త ప్రేమతో

పలికే వారుంటే


కన్నుల ధారలు ఆగేలా

బాధల బరువు తగ్గేలా

కాస్త ఓదార్పుతో

పలికే వారుంటే


కష్టాల కడలిలో కొట్టుకుపోతున్నప్పుడు

బలవంతపు బంధాలు అల్లుకున్నప్పుడు

అవమానాల రక్కసులు హత్తుకున్నప్పుడు


సొంత నీడను నమ్మలేక

నోరు తెరిచి అడగలేక

మాట రాక 

మనసు మూగబోయినప్పుడు


కాస్త గౌరవం ఇస్తూ

మనిషిలా మనల్ని గుర్తిస్తూ

మనల్ని సకారాత్మకత వైపు నడిపించే

మనిషి ఒకరు ఉంటే


అంత కన్నా ఏం కావాలి

మనసున మనసై 

బ్రతుకున బ్రతుకై

అని సంతోషంతో పాడుకోగలిగితే

అలసిన ఈ జీవికి ఇంకేం కావాలి



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract