ఓటరు చైతన్యం
ఓటరు చైతన్యం


ఐదేళ్లకోసారి జరుగుతాయి ఎన్నికలు
నటీ నటులుగా మారుతారు పార్టీ నేతలు
వాళ్ళు చేస్తారు చిత్ర విచిత్ర విన్యాసాలు
ఒక్కో ఓటుకు కడతారు రేటు
ఓటుకు వదులుతుంది పచనోటు
ఇది మనం చేసే పొరపాటు
మానాలి మనం ఈ దురలవాటు
మానకపోతే అది నీ గ్రహపాటు
మోసం చేసే నాయకుల వలలో చిక్కుతావో....
ఓటు అనే ఆయుధంతో పోరాడతావో....
నీ తలరాతను మార్చుకుంటావో....
ఆలోచించి నిర్ణయం తీసుకో.... ఓ ఓటరా !!!!