ఒంటి స్తంభపు మేడ
ఒంటి స్తంభపు మేడ
మనిషి మారుతూ....
పూరేకై..ఏకై....మేకై..
పడుగు పేకల్లాంటి కాలంలో
అజ్ఞానం..అదయ...ఆధిపత్యం. .
అహంకారపు దుప్పట్లు కప్పుకొని
నువ్వు నిదురపోతావు...
పగలో.....రాత్రో. తెలియక...
తెలుసనుకుంటూ..
తెలుసుకోక కాలం విలువ పడుకుంటావు...
ఆగని కాలాన్ని కౌగిలించుకుని..
రాగం..మధుర రవం..రాసం
ఎరుగకుండా..
ఎద మెత్తన చేసుకోకుండా...
వన్నెల వెన్నెలలో
వలపు వానల్లో తడవకుండా
ప్రాగ్దిశ వెల్లువౌ వేకువ పొలికేకలు వినకుండా
వెలుగు రేఖలు కనకుండా
ధమనులు సిరలలో సాగే
రక్తపు రంకెలు వింటూ
పలులు....పలుకులు
పలుకుల పలుకులు
ఏవీ పట్టించుకోలేవు
ధన పేటికల ..
.సమాధుల
ప్రాణ ధనమెంత నలుగుతోందో
తెలిపావా...ఎపుడైనా...
నీకు చేయందించాలనుకుంటా..
మట్టి వాసన
ఆమని ఆలింగనాల రుచి చూపాలని
నీలో మల్లెల గుబాళింపు ఇంపు. నింపాలనుకుంటా
మెలకువ మత్తునీయాలని
మోడు కాని మోదుగవై
పూయాలని
అడవి ఆత్మను నిలపాలని
పగడపు పెదవుల సీమల
నవ్వుల దివ్వెలు వెలిగించటం
నేర్పాలనుకుంటా..
నటనే లేని నడతెలాగో వివరించాలనుకుంటా
కాల్చటం..పేల్చడం..
పోల్చటం.. వ్రేల్చటం ...
రాల్చటం వద్దంటూ....
చెట్టును పచ్చగా ఎదగనీమంటూ...
ఐనా....
నీవు ఒంటరితనపు ఒంటి
స్తంభపు మేడలోనే...
