నీవే నా లోకం
నీవే నా లోకం
నీ కనులు చూసి కరిగిపోయాను...
నీ నవ్వు చూసి నలిగిపోయాను...
నీ మాట మాటలు విని మురిసిపోయాను...
నీ నడక చూసి నిలకడగా ఉండలేకపోయాను...
మొత్తానికి నీతో ప్రేమలో పడిపోయాను...
నీ చూపుల మాయలో నే మునిగిపోయాను...
నీ ఊహల దారిలో తప్పిపోయాను...
నీ ఊసుల గాలిలోనే తేలిపోయాను...
నీ ప్రేమలో నన్నే మరిచిపోయాను...
నీ కంటి చిలిపి నవ్వు నా గుండెను తాకే వేళ...
నీ మాటల మధురం నా ఊపిరిని దోచే వేళ...
నీ దగ్గర ఉంటే కాలం కూడా ఆగినట్టే...
నీ దూరం అయితే ఈ జీవితం మాయమయ్యేలా...
చిన్న చిన్న క్షణాల్లో నీ రూపమే కనిపిస్తే...
చూపు తిప్పలేని మాయలో నే మునిగితే...
నీ పేరు పలికితే గుండె వేగం పెరుగుతుంటే...
ఇది ప్రేమే కదా అని నా మనసు అడుగుతుంటే...
నీ జుత్తు తాకిన గాలి నన్ను చేరిన వేళ...
నీ అడుగులు పడిన లోకం నింపిన వేళ...
నీతో ఉన్న ప్రతిక్షణం పండుగలా అనిపిస్తే...
నువ్వు లేని లోకం నాకెందుకు అనిపిస్తే...
నీతో కలిసే కలలు నన్ను వెంటాడుతుంటే...
నీకోసం ప్రతిక్షణం గుండె ఎదురు చూస్తుంటే...
నీ ప్రేమే నా జీవితం అయిపోయిందంటే...
ఇంకేం కావాలి హృదయం కోరుకునే కంటే...
నీవే నా లోకం...!!!
