నీ నేను
నీ నేను

1 min

330
కడవరకూ ఉంటానన్నావు,
మన భవిష్యత్తు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ
ఎన్నో కబుర్లు చెప్పావు,
నిన్ను ఓ కలలా భావించమని ఒంటరిని చేసిపోయావు,
మనసు ఆనకట్ట తెగింది, కన్నీరు ఉరకలెత్తుతుంది,
నా కంటి నీరు ఎక్కడ నీకు భాద కలిగిస్తుందో అని దాయలేక,
మేఘాలకి లంచం ఇచ్చాను ఆకన్నీరును దాయమని,
వర్షాన్ని నాకు తోడు పంపమని...
నీ నేను..