STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

నాన్న ఒక నిశ్శబ్దం

నాన్న ఒక నిశ్శబ్దం

1 min
1



అమ్మ ఏడిస్తే ఇల్లంతా తెలుస్తుంది,
కానీ నాన్న ఏడిస్తే ఆయన గుండెకు కూడా తెలీనంత నిశ్శబ్దంగా ఉంటుంది!
ప్రపంచానికి ఆయనో కఠినమైన శిల కావచ్చు,
కానీ మన ఆకలి తీర్చడం కోసం రోజురోజుకూ కరిగిపోయే మైనపువత్తి... నాన్న!
రెక్కలొచ్చిన పక్షుల్లా మనం ఎగిరిపోతుంటే,
గూడు ఖాళీ అవుతున్నా... రెక్కల బలాన్ని చూసి మురిసిపోయే పిచ్చి ప్రాణం ఆయనది.
మనం అడిగినవన్నీ కొనివ్వడానికి తను అరిగిపోయిన చెప్పులతోనే నడుస్తాడు,
మనల్ని రారాజులా చూస్తూ, తను మాత్రం తెరవెనుక కార్మికుడిలా మిగిలిపోతాడు!
ఆయన గొంతులో కోపం వెనుక, మనల్ని కోల్పోతామనే భయం ఉంటుంది,
ఆయన మౌనం వెనుక, రేపటి గురించిన వేల ఆలోచనల యుద్ధం ఉంటుంది.
ఎవరికీ చెప్పుకోలేని బాధలను లోపలే దాచి,
పైకి మాత్రం కొండంత ధైర్యాన్ని అభినయించే అద్భుత నటుడు... నాన్న!
మనం గెలిచినప్పుడు లోకమంతా చప్పట్లు కొడితే,
దూరంగా నిలబడి కళ్లల్లో నీళ్లతో గర్వంగా నవ్వే ఆ ఒక్క ముఖం...
జీవితాంతం మోసినా తీరని ఒక తీపి రుణం!


Rate this content
Log in

Similar telugu poem from Classics