ముందుండాలి
ముందుండాలి
ముందుండాలి, ముందుండాలి
మంచి పనులలో ముందుండాలి
ఉదయాన్నే లేచేందుకు ముందుండాలి
యోగా, ధ్యానం చేసేందుకు ముందుండాలి
శుచి, శుభ్రతకు ముందుండాలి
పౌష్టికాహారం తినేందుకు ముందుండాలి
బడికి వెళ్ళేందుకు ముందుండాలి
చదివే చదువులో ముందుండాలి
నేర్చే పనుల్లో ముందుండాలి
ఆట పాటల్లో ముందుండాలి
సాయానికి, దానానికి ముందుండాలి
స్నేహనికి, త్యాగానికి ముందుండాలి
ఓర్పులో, నేర్పులో ముందుండాలి
శక్తిలో, యుక్తిలో ముందుండాలి
ఆత్మీయత, అనుబందాలలో ముందుండాలి
మర్యాద, మన్ననలో ముందుండాలి
మంచి ఆలోచనలలో ముందుండాలి
మంచి నడవడికలో ముందుండాలి
ముందుండాలి, ముందుండాలి
మంచి పనులలో ముందుండాలి