మనస్సు మాట
మనస్సు మాట


అయ్యో..!
మమతలు మాయమాయెనే....
మనుషులు దూరమాయెనే....
కన్న పేగే విషము చిమ్మెనే...
ఆ కన్న కడుపు తల్లడి ల్లేనే...
మానవత్వం మంట గలిసెనే..
మనసులకు మకిలి పట్టెనే.....
అయ్యో....!
సొంతమన్నది చేయిజారెనే...
కటిక చీకటి కాలమాయెనే...
జీవితమే శాపమాయేనే....
బ్రతుకే భారమయేనే....
అయ్యో.....!
పంచిన రక్తం తెంచుకు పోయెనే...
పెంచిన ప్రేమ ముక్కలాయేనే....
రాగ బంధాలకు చెదలు పట్టేనే....
కన్న కలలని కాటికి చేర్చేనే.......