మద్యపానానికి మాటవస్తే
మద్యపానానికి మాటవస్తే
జీవితాన మాననిగాయం చేశానని తిట్టిపోస్తున్నావు,
వికటించిన అనుబంధంలో
కన్నీటి కారణం నేనే అంటున్నావు,
నిన్నునీలో చూసుకో
మనసు క్షేత్రంలో కలుపులేకుండా వుంచుకో.
ఉపాధి చూపని విద్యతో
బ్రతుకే బరువైతే
బాధను మరిపించి బ్రతుకును యిచ్చాను,
విఫలమైన ప్రేమ
నిరాశ నిట్టూర్పులను కానుకచేస్తే
కలతతీర్చి ఊరట నిచ్చాను,
స్వార్ధపు సమాజం
మోసాలతో జీవితాన్ని బలిపశువుగా మారిస్తే
విషాన్ని వద్దంటూ నిషాగా ఉండిపోయాను,
పరిహసించు సమాజంలో
శోకపు కృంగుబాటుతో
మధ్యపానపు మత్తుగా
వెంట నిలిచి వేదనను వెలివేశాను.
ఆలి కుటుంబసభ్యుల విలాసకోర్కెలు తీర్చలేక విలవిలలాడే మనసుకు.
ఆత్మీయ నేస్తమైపోయాను,
అప్పుల ఊబిలోపడి
పరువు పోతుంటే
చీత్కారపు చూపుల విరాగంలో కన్నీటిని తుడిచే ఆనందంగా ఉండిపోయాను,
క్షీణించిన ఆరోగ్యం
మత్తు ఓదార్పు పనిచేయని వేళ
రెప్ప వెనుక చీకటిగా మిగిపోయాను,
అందుకే నిన్ను నీలో చూసుకో
తప్పేక్కడ జరిగిందో తెలుసుకో
సామాజిక కుటుంబ మానసిక
స్థితులను అర్ధం చేసుకో,
మమకారపు లేపనాలతో త్రాగుబోతును మార్చుకో,
