మౌనం
మౌనం
ఒక్కసారి విరిగిపోతే మళ్లీ అతకదు.
ఎన్నో వేదనల్ని దాస్తుంది .
సంతోషంతో సంబరపడిపోతుంది.
బాధతో కుమిలిపోతుంది.
కొందరు మనసును విరిచేస్తారు.
గాయపరుస్తారు ఆగాయం మానదు ఎప్పుడు.
అన్ని ఆలోచిస్తుంది ప్రతిసారి.
చిన్న మనసులో అలజడులెన్నో.
ప్రతి ఒక్కరూ ఆడుకుంటారు.
ఎవరికి నచ్చినట్లు వారు నొప్పిస్తారు.
ఎన్నో బరువులు మోస్తుంది.
దాచుకుంటుంది ప్రతి ఒక్కటి.
సూటిపోటి మాటలతో కత్తిలా గుచ్చుతారు.
వెనుక ముందు ఆలోచించరు.
ఏదో చేసి గాయపరుస్తారు తీవ్రంగా.
ఏదో ఆలోచనలో ముంచేస్తారు.
అలసిపోతుంది నిద్రలేని రాత్రులు గడుపుతుంది.
బాధతో బరువెక్కి పోతుంది.
బ్రతికు జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తుంది.
ఊపిరి ఉన్నంతవరకు ఊహల్లో తేలిపోయి మౌనం
దాలుస్తుంది మనసు చివరికి.
