మౌన నది
మౌన నది
ఒక మౌన నదిలాగ..ప్రవహిస్తు ఉంటాను..!
చెలిభావ వీణియగ..జీవిస్తు ఉంటాను..!
సంతోష సంద్రాలు..పొంగేవి కుంగేవి..
ఆనంద నిలయాన..నివసిస్తు ఉంటాను..!
ఇలలోను కలలోను..నిజప్రేమ సమరమే..
హరివింటి నారినే..సారిస్తు ఉంటాను..!
విరహమే నాచెలిగ..దక్కెనా భాగ్యమే..
విచ్చు కత్తులపైన..నర్తిస్తు ఉంటాను..!
ఆశపడు మనసింటి..సిగ్గులకు సెలవెపుడు..
ఊరించు చెలిమదిని..ఉడికిస్తు ఉంటాను..!
ఏడేడు లోకాలు..లోపలే కలవులే..
విహరించు సులువేదొ..వివరిస్తు ఉంటాను..!