లోన
లోన
బయట కురిసే వర్షం నాలో కురుస్తుంది.
అక్కడ చల్లగా ఉన్నా నాలో నే మండిపోతున్నా.
ఎటు చూసినా ఏవో ప్రశ్నల దారులు.
తెలియని తికమకలు.
చుట్టు ఏదో తెలియని భయం.
ఎద నిండా జ్ఞాపకాల సవ్వడులు.
ఏవో అలజడులు కళ్ళ ముందు కదలాడే విస్మయాలు.
అప్పుడప్పుడు ఎక్కడో చిక్కుకున్నా అనే భావన.
కదురుగా ఉండనివ్వదు అడుగులు కదలవు.
ఒంటి పైన ఉన్నా దేహం కనబడకుండా పోతుంది.
నీడ కూడ మాయమైపోతుంది నాకు తెలియకుండా.
ఎప్పుడు ఏమ్మవుతుందో తెలిసిరాని సమయం.
కళ లో లేను మెలుకువగా గా ఉన్నా.
అబద్ధం కాదు ఇది నిజం.
ఆగిపోలేక సాగిపోతున్నా ప్రతిసారి నాకు నేనుగా
మొదటి నుంచి..
