కన్నయ్య
కన్నయ్య
ఏమని చెప్పను ఎంత ని చెప్పను నీ మీద నా ప్రేమని కన్నయ్య...
నీ నా మీద ప్రేమ మరిచే వస్తువు కాదు...
నువ్వు నా జీవితంలో మరిచిపోయే జ్ఞాపకం కాదు...
నా ప్రేమ నీ కంటికి దూరం ఉండొచ్చు ఏమో కానీ నా మనసుకు దూరం కాదు...
ఎల్లప్పుడు నా మదిలో కొలువు ఉండే నువ్వు
నీ ప్రేమ కోసం ఎదురు చూసే నేను....
నేను నిన్ను మరిచాను అంటే కన్నయ్య నన్ను నేను వదులు కున్నట్లు...
నీ నల్లని రూపం ,నీ వేణువు గానం నీ చల్లని చిరునవ్వు...
నీ కోసం పరితపించు ఈ మనుసు వేచి చూస్తోంది నీ కోసం...
నీ ప్రేమను అందించడానికి వస్తున్నావా కన్నయ్య!
నీ కోసం ఎదురుచూసే నీ వాసంతి మైత్రిక...
