హే ! ఎవరు నువ్వు?ఎక్కడ నువ్వు?
హే ! ఎవరు నువ్వు?ఎక్కడ నువ్వు?
ధ్వనిస్తుంది నీ నవ్వే నాలోనా
ఇంతలా ధ్యానిస్తున్ను నిన్నే ఏంటో
ఎవరు నువ్వు?
నీ ధ్యాసలో నన్నే మరిచితిగా నేను
ఇంతలా మతిపొగొడుతున్నవు
ఎవరు నువ్వు?
నా ఈ ఒంటరి జీవితంలో ఉన్నట్టుండి నా మోముపై చిరునవ్వు చిందెనుగా
ఇంతలా సంతోషం ఇస్తున్నవు
ఇంతకి ఎవరు నువ్వు?
నడుస్తూ నడుస్తూ వెనక్కి చూస్తూన్న ఇది ఏదో వింతగా
ఇంతలా మైమరిపిస్తున్నవు
ఎవరు నువ్వు?
ప్రక్కన లేవు కాని ఉన్నట్టు నాలో నేనే పలకరింపులు
ఇంతలా గిలిగింతలు పెడుతున్నారు
ఇంతకి ఎవరు నువ్వు?
నా ప్రతి ఊహలో నన్ను ఊరిస
్తున్నవు
ఇంతలా నన్ను ఉరకలు వేయిస్తున్నవు
ఎవరు నువ్వు?
నా ప్రతి ఆలోచనలో ఆదమరిచేలా చేసావు నన్ను
ఇంత అద్భుతానివి
ఇంతకి ఎవరు నువ్వు?
ఈ మండే ఎండలోనూ చల్లటి చిరుగాలులు నాపై వీస్తూన్నవు
ఇంతలా హాయి ని ఇస్తూన్నవు
ఎవరు నువ్వు?
నా కోపాన్ని చప్పున చల్లార్చే గుర్తొచ్చిన నీ నవ్వు
ఇంతటి అద్భుత ఔషధం లాగా ఉన్నావు
ఎవరు నువ్వు?
నిరంతరం నీ ధ్యాసలో నీట మునిగిన నావనై ఉన్నాను
ఇంతలా మాయ చేసి మార్చేసావుగా నన్ను
ఇంతకి ఎవరు నువ్వు?
బహుశా నాలో మొదలైన ప్రేమ భావమేమో నువ్వు.......