Friends
Friends
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
213
సూర్యకిరణాలు తో ఉత్తేజ పడే శరీరం
ప్రశాంతమైన మనస్సు తో శ్వాస ని ఆస్వాదించేలోపే
కాళీ మనస్సు ను వ్యర్త ఆలోచనలాతో నింపడానికి ఉవ్విళ్లూరే సాధనం
ఆ ఆలోచనల సరిహద్దు లో స్వేచ్ఛ కోసం పోరాడే మనస్సు
ఆ మనస్సు తో అంతర్యుద్ధం చేస్తున్న నాకు కార్యాలయం లో మొదటిగా స్వేచ్ఛ కు బాటలు వేసేది కల్మషమ్ లేని నవ్వు, నన్ను ఎప్పటికి విమర్శించని ఒక అమాయకత్వం.
ఆ తరువాత మనస్సు ని తాకే ఒక ఆత్మీయత, నా ఆనందం లో తన ఆనందాన్ని వెతికే ఒక గొప్పతనం.
వీలిద్దర్నీ కలిసాక కుదుట పడ్డ మనస్సు పని లో నిమగ్నమవవుతున్న సమయం లో.....
నా ఆలోచనలకు ఇంకో గొంతు ఉందా అని ఆశ్చర్యపరిచే రూపం....
తన ఆనందాన్ని నాకు పరిచయం చేస్తున్నాననుకుంటు, నాలో ఎన్నో కొత్త ఒరవడులకు పునాది వేసే ఆవేశం..
నా చెయ్యి పట్టుకొని సరైన బాట లో నడిపించే ప్రయత్నం..