భయం నన్ను భాదిస్తుంది
భయం నన్ను భాదిస్తుంది
బాల్యం నన్ను భయపెట్టింది కానీ బాధించలేదు
అమ్మ బూచోడామ్మ బూచోడాన్న
నాన్న కళ్ళు ఎర్రగా చేసిన
ఉపాధ్యాయులు దండించిన
బాల్యం నన్ను భయపెట్టింది కానీ బాధించలేదు
కాని ఇప్పుడు
నా తల్లిదండ్రులు కార్చిన చెమట చుక్కల్ని
నా అన్నదమ్ముల నమ్మకాన్ని
నా మిత్రులా ప్రోత్సాహాన్ని
ఒమ్ము చేకూడదని అను క్షణం ఎదో తెలియని భయం నన్ను బాధిస్తుంది
ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు అని తేలిసిన
జీవించడం కోసం ప్రజలు తీస్తున్న పరుగులు
సంపాదించడం కోసం వారు ఎన్నుకుంటున్న మార్గాలు
తెలియని శున్యం చేరుకోడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు చూసినప్పుడు అను క్షణం నేను భయపడుతున్న
కాలం మనుషులలో తీస్
కొచ్చినా మార్పులు
విలువలు లేని మనుసులు వారి కఠినమైన మనసులు
ప్రాణం లేని కాగితం నిండు ప్రాణాలను తీస్తున్నప్పుడు
జ్ఞానం లేని మనుసులు రాజులై రాజ్యాలు ఏలుతున్నప్పుడు
ప్రజలే ప్రతినిధులను ఎన్నుకొని వారికీ జీతాలు ఇస్తూ వారి దగ్గరే బిక్షామ్ అడుగుతున్నప్పుడు
నాకు అణువు అణువునా భయం కలుగుతుంది
క్రూర మృగాలుగా మరీనా ఇ పచ్చ నోట్ల మద్య
మానవత్వం నశించిపోతున్న ఇ రాబంధుల మధ్య
రంగు రంగుల వెలుగుల ప్రపంచం లో జీవిస్తున్న ఇ చీకటి మనుషుల మధ్య
జీవించాలంటే అనుక్షణం నాలో ఎదో తెలియని భయం
అప్పుడప్పుడు ఆకాశం దాటి వినపడేలా అరవాలి అనిపిస్తుంది
ఎమీ తెలియని ఆ బాల్యం లోకి మళ్ళీ వెళ్ళాలి అనిపిస్తుంది