STORYMIRROR

Swetcha k

Classics

3  

Swetcha k

Classics

అసలైన జీవిత సత్యాలు

అసలైన జీవిత సత్యాలు

1 min
7

కోల్పోయిన జీవితం, గడిచిపోయిన కాలం తిరిగిరావు, మధురమైన జ్ఞాపకాలు , మరపురాని గాయాలు , నిన్ను విడిచిపోవు.

మంచి మనుషుల సహవాసం నీ గాయాలకు మందు అయి వాటిని మాన్పవచ్చు లేక నిరంతరం నిన్ను గుచ్చే వాళ్ళు చుట్టూ చేరి నీ గాయాలను తిరిగి రేపుతూ ఉండచ్చు , అందులో నీ తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు , స్నేహితులు , బంధువులు , తెలిసిన వాళ్ళు , తెలియని వాళ్ళు ఇలా ఎవరైనా ఉండొచ్చు.

నిన్ను నిన్నుగా అర్ధం చేసుకునే వాళ్ళు , నీ కోసం ఎల్లపుడూ ఉండే వారిని ఎప్పుడూ కోల్పోకు, వారు నీ రక్తసంబంధం లేని వాళ్ళు అయినా, వారే నీ అసలైన ఆప్తులు అని మరచిపోకు. ఈ లోకంలో ఎవరు నీ కోసం ఉన్నా లేకున్నా , నువ్వు నీకోసం ఉంటావు ,మరి ముఖ్యంగా దేవుడు ఎల్లపుడూ నిన్ను నడిపిస్తుంటాడని గుర్తుంచుకో. 

అసలైన జీవించడం అంటే ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం. నువ్వు ఆనందంగా ఉంటూ నలుగురికీ మంచి చేస్తూ ఉంటే, ప్రశాంతత లభిస్తుంది. జీవితం సాఫీగా సాగుతుంది.


Rate this content
Log in

Similar telugu poem from Classics