Kandarpa Murthy

Tragedy

3  

Kandarpa Murthy

Tragedy

అమ్మా! నా ఆవేదన / నివేదన వనవా

అమ్మా! నా ఆవేదన / నివేదన వనవా

1 min
287


అమ్మా , నాన్నా! నన్నూ బ్రతక నివ్వరూ!

ఆడ పిల్లనని కడుపులోనే కరిగించకండి

నన్నూ భూమ్మీదకు రానివ్వండి

సూర్య చంద్రాదులను దర్సించు కోవాలనుంది

రాత్రింబవళ్లు ఎలా గుంటాయో చూడాలనుంది

అమ్మా! ఆడపిల్లని అంతం చెయ్యకు, నువ్వూ ఆడదానివని గుర్తుంచుకో

నాన్నా! ఆడపిల్లనని నిరాశ పడకు , కొడుకులా నన్నూ పెంచు

అమ్మా! నీ పొత్తిళ్లలో పసి పాపనై ఊసులు చెబుతా

నాన్నా ! నీ చేతి వేళ్లు పట్టుకుని బుడి బుడి అడుగులు వెయ్యనీ

నానమ్మా , అమ్మమ్మా! నా చిట్టి చేతులతో మీ కాళ్లను ఒత్త నివ్వండి

తాతయ్యలూ! మీ వీపుల మీద గుమ్మాడి ఊగనివ్వండి


Rate this content
Log in

Similar telugu poem from Tragedy