అమ్మ - తొలిదైవం
అమ్మ - తొలిదైవం


పొద్దున్న లేవగానే తలుచుకునే దైవం అమ్మ!
చిన్నతనంలో అందంగా ఆనందంగా నిన్ను చూసాను
అమ్మంటే ఇలానే వుంటారేమో అనుకున్నాను!
కాని అమ్మని అయ్యాక తెలిసింది, ఏమని?
పరిస్థితి ఎలా వున్నా అమ్మ అలానే వుంటుంది అని
నేర్చుకున్నా జీవితపాఠాలు అమ్మ దగ్గర
ఏ పాఠశాలకు వెళ్ళని, పట్టాలు పొందని మొదటి గురువు దగ్గర
అనుకుంటా నేను నీలా వుండగలనా, నా పిల్లల మదిలో?
నిన్నే అనుకరిస్తే నీలో సగం అన్న కాకపోతానా, అనే చిన్న ఆశలో!