STORYMIRROR

Midhun babu

Fantasy Inspirational Children

4  

Midhun babu

Fantasy Inspirational Children

అమ్మ ఆశయం

అమ్మ ఆశయం

1 min
381


అమ్మ ఆశయమే నిన్ను నడిపించాలి,

దుఃఖమైనా మౌనమైనా నిట్టూర్పులను వెలివేయాలి.


చీత్కరించిన మనసులకు

నీమార్గం ఆదర్శమై నిలవాలి,

కునుకులేని కష్టాలకు

సంతోషసిరులను బహుమతిగా ఇవ్వాలి,

విధవ్రాతను మార్చేటి

నీప్రయత్నమే

దుఃఖాలగాథలకు ముగింపు పలకాలి,

అక్షర వెలుగుల అపురూప దృశ్యమే నీవుగా అవనియందు నిలవాలి.


అబల వెంటనడిచే అశృనీడలు

నీ కన్నెర్రతో నిష్క్రమించాలి,

బాధలకు స్పందించే నీహృదయమే సమాజానికి నేస్తంకావాలి,

వెలుగుదారుల్లో జాతిని నీవేనడపాలి,

నీఆరాటమే విజయపు బాటలై

శోకాలకు ముగింపు పలకాలి,

అమ్మ జీవనకాంక్షే

జాతిభాగ్యరేఖగా మారి చరితలో నీవు నిలిచిపోవాలి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy