Shaik Sameera

Thriller

4  

Shaik Sameera

Thriller

ప్రేమ సంఘర్షణ

ప్రేమ సంఘర్షణ

4 mins
305


          ఎపిసోడ్-25

రిథిమా నా ప్రేమ ఇంత పెద్ద మూల్యం అడిగింది అని మనసులో అనుకుంటుంది.పూజారిగారు పెళ్లి తంతు పూర్తి అయ్యిందని మీ ఇద్దరు ఈరోజు నుండి భార్యభర్తలు అనగానే వంశ్,రిథిమా పెళ్ళిపీటల మీద నుండి లేచి వంశ్ నానమ్మ ఆశీర్వాదం కోసం తన కాళ్ల పైన పడి మొక్కుతారు.వంశ్ నానమ్మ వాళ్ళ ఇద్దరినీ ఎప్పుడు సుఖంగా ఉండండి.జన్మ జన్మలకి తోడుగా కలిసే ఉండండి అని ఆశీర్వదిస్తుంది.రిథిమా బాధగా ఉండటం చూసి నానమ్మ ఏమైంది రిథిమా ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు ఈ పెళ్లితో నువ్వు సంతోషంగా ఉన్నావుగా అని అడుగుతుంది.

రిథిమా-పెళ్లి ప్రతి అమ్మాయి కల అవుతుంది నానమ్మ .ఆ కల నిజమయి కళ్ల ముందుకి వస్తే నమ్మకం కలగదు.యే కల అయితే చూసిందో అలాగే ఉందా లేదా అనే అనుమానం కలుగుతుంది.మిగతా అందరి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంటారు.వంశ్ నానమ్మ గృహప్రవేశ తంతు మొదలుపెడదాం అంటుంది.వంశ్ అమ్మ అనుప్రియ వంశ్ ,రిథిమాకి హారతి ఇస్తుంది.రిథిమా బియ్యం కలశం నెట్టి ఇంట్లోకి అడుగుపెడుతుంది.

వంశ్ మనసులో welcome to hell రిథిమా అనుకుంటాడు.రిథిమా వంశ్ ని వదిలేసి నడుచుకుంటూ ముందుకి వెళ్ళిపోతుంది.షాక్ లో ఏం చేస్తుందో తెలియక నడుచుకుంటూ స్తంభాన్ని గుద్దుకోబోతే వంశ్ రిథిమా అని పిలవడంతో స్పృహలోకి వచ్చి తన మెడలోని వరమాల తీసేసి లోపలికి వెళ్ళిపోతుంది.అనుప్రియ పిలుస్తుంది రిథిమాని కానీ తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది.వంశ్ నానమ్మ అనుప్రియతో వెళ్లనివ్వు బాగా అలిసిపోయింది పెళ్లి తంతులో కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే మాములు అయిపోతుంది అంటుంది.రిథిమా మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోతుంది తన రూంలోకి.రిథిమా వాష్రూంలొకి వెళ్లి వాష్ బేసిన్ ముందు నిల్చొని అద్దంలో తనని చూసుకుంటూ తను కబీర్ కి ప్రపోజ్ చేయడం గుర్తొచ్చి వాటర్ తీసుకొని తన మొహం మీద కొట్టుకుంటూ ఉంటుంది.కబీర్ కూడా ఒంటరిగా వెళ్తూ రిథిమాని తన లక్ష్యం కోసం వంశ్ ని పెళ్లి చేసుకోమనటం గుర్తొచ్చి రిథిమా అని అరుస్తూ తన చేతిని తన పక్కన ఉన్న చెట్టుకేసి కొడతాడు గట్టిగా.రిథిమా వంశ్ తన నుదిటి పైన పెట్టిన సిందూరం పోవాలని నీళ్లు తన మొహం మీద కొట్టుకుంటూనే ఉంటుంది.ఎందుకు అని ఏడుస్తూ ఎందుకు కబీర్ ఇంత పెద్ద శిక్ష వేశావు అని ఏడుస్తుంది.కబీర్ కూడా కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు.

కబీర్ రిథిమా iam sorry అంటూ బాధపడుతూ ఉంటాడు.రిథిమా అరుస్తూ వాటర్ తన పైన కొట్టుకుంటూ ఏడుస్తుంది.వంశ్ శత్రువుని పట్టుకోలేకపోయారని ఫ్లవర్ వాజ్ కింద పడేస్తాడు కోపంతో.

రాజ్ -అది చూసి బాస్ నేను కేటర్స్ అందరిని బాగా చెక్ చేశాను.కానీ ఆ ఇద్దరు ఈ మాన్షన్ నుండి తప్పించుకొని వెళ్లిపోయారు iam sorry boss అంటాడు.షీరా కూడా వాళ్ళు తీస్కెళ్ళారేమో అంటాడు.

వంశ్ -వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చింది షీరా కోసమే.

రాజ్ -నేను ఇప్పుడే బయట ఉన్న నా ఫోర్స్ కి కాల్ చేసి యాక్టీవ్ చేస్తాను ప్లీజ్ trust mee బాస్ మన బిజినెస్ గురించి యే క్లూ కూడా బయటికి వెళ్లనివ్వను ఏదైనా చేస్తాను ప్లీజ్ trust mee బాస్.కాల్ చేయబోతుంటే వంశ్ ఆపుతాడు.

వంశ్-ఎవరికీ కాల్ చేయాలిసిన అవసరంలేదు అని తన చేతిలో ఉన్న షీరా చూపిస్తాడు రాజ్ కి.షీరా మాయం అవుతుంది ఇంటి నుండి అలాగే sheera దొరుకుతుంది ఇంట్లోనే.దీనికి అర్థం ఒకటే షీరా ని తీసుకెళ్ళడంలో unsuccesfull అయిఉండాలి లేదా మనకి తెలియకుండా ఏదో జరుగుతూ ఉండాలి.

రాజ్-బాస్ ఎప్పుడు ఎలా ఎక్కడ మీకు షీరా దొరికింది.

వంశ్-రిథిమా తన రూమ్ నుండి ఎప్పుడైతే మాయం అయిందో అప్పుడు. మనమందరం తనని వెతుకుతున్నామో అప్పుడు నేను తన రూంలోకి వెళ్ళినపుడు అక్కడ షీరా దొరికింది.

రాజ్-అంటే రిథిమానే మన శత్రువా తనే షీరా తీసుకొని మాన్షన్ నుండి బయటికి వెళ్లాలనుకుందా అంటాడు.

వంశ్-షీరా రాజ్ కి ఇచ్చి జాగ్రత్తగా ఉంచు దీన్ని అని చెప్పి వెళ్ళిపోతాడు.

ఆర్యన్-చంచలతో చెప్పాను కదా అమ్మ షీరా పేరు ఎత్తోదని నేను సరైన సమయంలో సరైన ప్లేసులో షీరా ని దాచేసాను.

చంచల-ఎక్కడ దాచావు షీరా ని.

ఆర్యన్ మనసులో రిథిమా మీద కోపంతో కావాలని షీరా ని రిథిమా రూంలో పెట్టడం గుర్తు చేసుకుంటాడు.

రిథిమాని ఇషాని,సియా మొదటి రాత్రి కోసం వంశ్ రూమ్ కి తీస్కెళ్ళాలని తీసుకెళ్తూ ఉంటే తను వంశ్ రూమ్ దాటి ముందుకి వెళ్లబోతుంటే సియా రిథిమాని ఆపి హలో వదిన ఈరోజు నుండి నువ్వు మిస్ కాదు మిసెస్ వి వంశ్ అన్నయ్యతో పాటు 50% ఈ రూమ్ పార్టనర్ వి.ఈరోజు నుండి మీరిద్దరూ తోడుగా ఉంటారు.వదిన ప్రశాంతంగా కూర్చొని వెయిట్ చేయండి అన్నయ్య కోసం.Seriously ఈరోజు అన్నయ్య మిమ్మలన్నీ చూసి ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోవాలి.అది విని ఇషాని ఎవరి ఊపిరి ఆగుతుందో ఎవరి ఊపిరి పోతుందో అది సమయమే చెబుతుంది అని వెళ్ళిపోతుంది.సియా వంశ్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది.రిథిమా లోపలికి వెళ్తుంది డోర్ క్లోజ్ అయిపోతుంది.రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంటుంది.రిథిమా ఏడుస్తుంది తన కంటి నుండి పడిన కన్నీటిని తన చేతిలోకి తీసుకొని.

వంశ్- ఇలాంటి రోజున రాత్రి వధువు కళ్ళలో కన్నీళ్లు ఎవరికోసం ఈ బాధ ఎవరికోసం నువ్వు కూడా దాచిపెట్టలేకపోతున్నావు.నువ్వు మాటలు దాచడంలో అయితే బాగా ఎక్సపెర్ట్ వి కదా. వంశ్ మాటలకి వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది.ఇంకా ఏవేం దాచావు నా నుంచి అని అడుగుతాడు.

రిథిమా-ప్రతిసారి అనుమానంలో బ్రతకడం అలవాటా లేకపోతే మీ హాబీ నా అని అడుగుతుంది.

వంశ్-అలవాటు కాదు హాబీ కాదు నిస్సహాయత. బ్రతికి ఉండాలి అంటే అవసరం.Strange ఎప్పుడు నా అనుమానం ఇప్పటివరకు తప్పు కాలేదు.మ్యారేజ్ అనేది ఇద్దరు సాధారణ వ్యక్తుల మధ్య జరుగుతుంది.వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకొకరికి స్థానం ఉండదు.ఆ ఇంకొకరు మనిషి అవ్వొచ్చు లేదా భగవంతుడు లేదా ఏదైనా రహస్యం కూడా అవ్వొచ్చు.

రిథిమా-నిజం చెప్పారు మీరు.పెళ్లి సాధారణ వ్యక్తుల మధ్యే జరుగుతుంది.కానీ మన పెళ్లిలో ఏది నార్మల్ గా జరగలేదు.నేను నువ్వు ఈ పెళ్లి ఏది నార్మల్ కాదు అనగానే వంశ్ నవ్వుతాడు.

వంశ్-ముల్లు గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటే దాన్ని దాచిపెట్టరు తీసి పడేస్తారు.ఈ పెళ్లితో ఇంత ప్రాబ్లెమ్ ఉంటే పెళ్లి మండపం నుండి ఎందుకు పారిపోలేదు నువ్వు .అవకాశం కూడా ఉంది కదా నీ దగ్గర ఎందుకు తిరిగి వచ్చావు.ఏదైనా కారణం ఉందా లేదా ఏదైనా మిషన్ ఉందా అంటూ రిథిమా పైకి వస్తూ ఉంటే రిథిమా వెనక్కి అడుగులు వేస్తూ బెడ్ మీద పడుతుంది.వంశ్ కూడా తన పైన వంగి తననే చూస్తూ నవ్వుతూ పైకి లేస్తాడు.కారణం ఏదైనా నిజమయితే ఈరోజు నువ్వు వంశ్ రాయ్ సింఘానియా భార్యవి.పెళ్లైన రాత్రి ప్రతి భర్త తన భార్యకి ఒక అందమైన స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలి అంటారుగా.MRS.వంశ్ రాయ్ సింఘానియా నీకోసమే స్పెషల్ గిఫ్ట్ అని ఒక బాక్స్ చూపించి తెరవమంటాడు.

రిథిమా ఆ బాక్స్ తెరుస్తుంది అందులో గన్ ఉంటుంది.రిథిమా ఆ గన్ చూసి షాక్ అయ్యి వంశ్ వైపు చూస్తాడు.వంశ్ రిథిమా వైపు చూసి నవ్వుతాడు.గిఫ్ట్ అయితే ప్రాణాలు తీసేలా ఉంది కదా perfect గా గన్ తీసుకోమంటాడు కానీ రిథిమా తీసుకోదు.వంశ్ యే గన్ తీసుకొని రిథిమా పైన గురి పెట్టి షూట్ చేస్తాడు కానీ అందులో బులెట్ ఉండదు.నవ్వుతూ వంశ్ బెడ్ మీద కూర్చొని పొరపాటున నన్ను మోసం చేయాలనీ అనుకోవద్దు.ఒక వేళా మోసం చేసిన అది తెలిసేలోపు ఈ గన్ తో నిన్ను కాల్చుకొని అంతం చేసుకో అంటాడు.


 


Rate this content
Log in

Similar tamil story from Thriller