STORYMIRROR

Dinakar Reddy

Abstract Fantasy

3  

Dinakar Reddy

Abstract Fantasy

కింబళి

కింబళి

1 min
253

ఏమిటయ్యా పెళ్లి పెద్దలమని శుద్ధ మొద్దులు తయారయినారు. శాకాంబరీ దేవీ ప్రసాదం. ఆంధ్ర శాకం. గోంగూర లేనిదే ప్రభువులు ముద్దయినా ముట్టరు. 

మాకో కింబళి తెచ్చి పెట్టండి ముందు అన్నాడు శాస్త్రి. 


లంబూ జంబూ తమ గురువు సృష్టించిన మాయా కింబళిని శాస్త్రి శర్మల గదిలో ఉంచుతారు.


శాస్త్రి శర్మా ఇద్దరూ నగర పర్యటనకు బయలు దేరారు.


శర్మా! ఏమిటీ ఇది మన హస్తినాపురం కన్నా వైభవంగా ఉంది అన్నాడు శాస్త్రి. 


అవును శాస్త్రి గారూ! ఈ వింత కట్టడాలు. మేఘాలే వచ్చి జలాల్ని కుమ్మరిస్తున్నట్టు ఉన్న ఈ సరస్సులు. ఆ విలాస మందిరాలు.ఇందంతా చూస్తే మాయా బజారులా ఉంది అన్నాడు శర్మ.


గతంలో మయ సభలో మన దుర్యోధన మహారాజుకి జరిగినట్లు ఇక్కడ కూడా అవమానం జరగదు కదా అనుకుంటూ గదికి చేరారు ఇద్దరూ.


కింబళి చేసే అల్లరితో వారికి ఆ రాత్రి నిద్ర లేనట్లే.


Rate this content
Log in

Similar telugu story from Abstract