STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

3  

Dinakar Reddy

Abstract Inspirational

ప్రవచనంలో క్రికెట్ దేవుడు

ప్రవచనంలో క్రికెట్ దేవుడు

1 min
163

మామూలుగా అయితే క్రికెట్ చూసే వాళ్లకూ చూడని వాళ్లకూ కూడా సచిన్ టెండూల్కర్ గారి పేరు తెలియకుండా ఉండడం అరుదు.


తమ ప్రవచనాలతో తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు.


ఆయన ఒకానొక సందర్భంలో విద్యార్థులను ఉద్దేశించి చెబుతూ అబ్దుల్ కలామ్ సచిన్ టెండూల్కర్ లాంటి వారిని గౌరవించడం అభిమానించడం ఎంత మంచిదో అలాగే వాళ్ళు గొప్ప వాళ్ళు కావడానికి ఏం చేశారో తెలుసుకోవాలని చెప్పడం నన్ను చాలా ఆకర్షించింది.


సచిన్ ప్రాక్టీసు చేసేప్పుడు పడ్డ కష్టం, అతని శ్రద్ధ అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సంస్కారం, మానవత్వపు విలువలు ఇవన్నీ విద్యార్థులు సచిన్ టెండూల్కర్ జీవితం నుంచి నేర్చుకోవాలి అని చెప్పడంతో క్రికెట్ చూడని నేను సచిన్ టెండూల్కర్ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను.


Rate this content
Log in

Similar telugu story from Abstract