Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varun Ravalakollu

Drama Romance Thriller

4.8  

Varun Ravalakollu

Drama Romance Thriller

డేంజరస్ లైఫ్ -3

డేంజరస్ లైఫ్ -3

2 mins
393


' ఇంతకీ నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావ్ విన్నీ..? '

అడిగాను నేను.


" జర్నలిస్ట్ని అవ్వాలి బావ...నీకు తెలుసు కదా ? అయినా కోర్స్ లో జాయిన్ చేసింది నువ్వేగా. "


' మరి ఇప్పుడేంటి ప్రాబ్లెమ్ ? '


" మా నాన్న, అదే మీ మామ, మిస్టర్ పార్థసారథి IPS కి ప్రాబ్లెమ్. నేను కూడా తనలా పోలీస్ అవ్వాలి అంటాడు. నాకేమో ఇష్టం లేదు బావ. I am against violence. అలా చేతిలో గన్ పట్టుకుని క్రిమినల్స్ చుట్టూ తిరగడం... I know, that doesn't suit me.. అయినా అలా చిన్న బులెట్ తో ఒక్క క్షణంలో ఒక ప్రాణాన్ని ఎలా తీస్తారు బావ !!

అయినా నేను ఎంచుకున్న జాబ్ మంచిదేగా... జర్నలిస్ట్.. తప్పు చేసేవారిని శిక్షించలేకపోయిన, ఆ తప్పుని బయటపెట్టే జాబ్ "


' ఇంతకీ ఏమైంది ? '


" తెలుసుగా.. నాకు ' NewsToday ' పేపర్లో రిపోర్టర్ గా జాబ్ వచ్చిందని.. అది మా నాన్నకి తెలిసి పెద్ద గొడవ అయింది...It's ok లే... కొన్ని రోజులకు సర్దుకుంటుంది "


' అయినా ఏదైనా న్యూస్ ఛానల్లో ట్రై చెయ్యొచ్చుగా ? టీవీలో కనిపిస్తావ్ '


" ఎలక్ట్రానిక్ మీడియా అంత సొల్లు బావ.. I like print media"


*************************


ఇప్పుడు


మళ్ళీ నర్సులా మాటలు :


' తెలుసా ఈ పేషెంట్ పెద్ద క్రిమినల్ అంట. వాళ్ళ అమ్మ అంటుంటే విన్న. ఆవిడ ఇతని కాబోయే భార్యతో ఏమనిందంటే ? '


" విన్నీ... ఏ జన్మలో ఏ పాపం చేసానో ... వీడు ఇలా తయారయ్యాడు. ఎలా ఉండే భాను ఎలా అయిపోయాడు. మా అన్న IPS, నా కొడుకేమో క్రిమినల్. నెలకి ఒకసారి ఇలా హాస్పిటల్ బెడ్ మీద పడతాడు. వాడికి ఎప్పుడు ఏం అవుతుందో అని క్షణక్షణం నరకం అనుభవిస్తున్న. ఈ వయసులో ఇంతకుమించి తట్టుకునే శక్తి నాకు లేదు.ఆ దేవుడు నన్ను తీసుకుపోవచ్చు కదా..


తల్లిగా నాకంటే తప్పదు. నువ్వెందుకు వాడిని పెళ్లి చేసుకుని నిండు జీవితం నాశనం చేసుకుంటావ్ ? అసలే తండ్రిని పోగొట్టుకున్నావ్. ఇలాంటి భర్తతో జీవితాంతం బాధ పడతావా ?ఆలోచించుకో. మీ అమ్మతో కావాలంటే నేను మాట్లాడతాను " అంటూ బాధ పడింది..


ఇంకో నర్స్ : " హా !! నేను ఎప్పుడో అనుకున్న వీడు క్రిమినల్ అని. ఇప్పటికి మన హాస్పిటల్లోనే ఇలా బులెట్ గాయాలతో 5 సార్లు జాయిన్ అయ్యాడు. ఏ పోలీస్ వచ్చి కేస్ ఫైల్ చెయ్యేడు.. అప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఆ అమ్మాయి చక్కగా ఉంది. ఇలాంటివాడు భర్తగా రావడం ఏంటో.."


అవును నిజమే... మా మామ IPS, విన్నీ జర్నలిస్ట్, నేనేమో క్రిమినల్. వింత ఫ్యామిలీ నాది !!

మా మావయ్యని చంపింది నేనే. ఈ మేటర్ మా అమ్మకి తెలిస్తే ఏమైపోతుందో !!! అమ్మ చెప్పినట్లు నేను నిజంగా విన్నీకి సరిపోనా ????


***************


అప్పుడు :


స్వామిజి చెప్పిన మాటలు నేను బలంగా నమ్మసాగాను. ప్రాణాలకు తెగించైనా టెస్ట్ చేసేంతగా.... ఇక మా ఊరి దగ్గర్లో ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ సెంటర్ ఉంది. మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడు.. అక్కడికి ఏదో విసిట్ లాగా మా ఫ్రెండ్ హెల్ప్ తో వెళ్లి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ లైన్ పట్టుకున్న.. 1 మినిట్ గుండె జల్లు మంది భయంతో.. కానీ చూస్తే నేను బతికే ఉన్న ..


మా ఫ్రెండ్ సడన్ గా వచ్చాడు.. రేయ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ ఏదో ఫెయిల్ అయ్యిందంటా.. ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది. 3 ఇయర్స్ గా ఎప్పుడు ఇలా జరగలేదు. మాకింకా చేతి నిండా పని. నువ్వు ఇంటికి వెళ్ళిపో....తర్వాత ఎప్పుడైనా చూపిస్తా అన్నాడు..


అప్పుడు కంఫర్మ్ అయింది. చావు చచ్చిన నా జోలికి రాదు అని. ఏదో అచీవ్ చేసిన ఫీలింగ్.


నాకు నేను చావాలని ఎప్పుడు అనుకుంటాను ?


ముసలితనంలో, లేదా ఏదైనా పెద్ద భరించలేని రోగం వస్తే తప్ప చావాలి అనిపించదు.. ఇక లైఫ్ లో చిన్న చిన్న ప్రాబ్లెమ్స్ / డిప్రెషన్స్కే చనిపోయే మూర్కుడిని కాదు. సో నేను చావుని జయించినట్టే !!!


నెమ్మదిగా ఆలోచించ సాగాను. ఇన్ని కోట్ల జనాభాలో నా ఒక్కడికే ఈ వరం ఉందంటే నేను కోటిలో ఒక్కడిగా బ్రతకకూడదు. ఏదో చెయ్యాలి. ఏదో సాధించాలి.



Rate this content
Log in

Similar telugu story from Drama