Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dinakar Reddy

Abstract Inspirational Children

3  

Dinakar Reddy

Abstract Inspirational Children

వాట్సాప్ కాలం - మిత్రలాభం

వాట్సాప్ కాలం - మిత్రలాభం

1 min
310


రేణూ! నువ్వు ఆ రాజీవ్ గాడితో స్నేహం చేయడం మంచిది కాదు. ఒక్క సారి ఆలోచించు అన్నాడు వైభవ్.


రేణుక అతని మాటల్ని కొట్టి పడేస్తూ అతను నాతో మంచిగానే ఉంటున్నాడు. మన ముగ్గురం మంచి ప్రెండ్స్ లా ఉందాం. ఇక పద కాలేజ్ కి వెళదాం అని బయలుదేరింది.


వైభవ్ మాత్రం రాజీవ్ అమ్మాయిలతో చేసే చేష్టలు గమనిస్తూ ఉన్నాడు.


ఒక రోజు రేణుక ఏడుస్తూ ఉంది. ఏమైంది రేణుకా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వైభవ్.


తన ఫోటోలు అబ్బాయిల వాట్సప్ గ్రూపులో ఉన్నాయని అవి చూసి అందరూ తనని ఆట పట్టిస్తున్నారని బాధపడుతూ చెప్పింది.


వైభవ్ తనకున్న హ్యాకింగ్ స్కిల్స్ తో ఆ వాట్సాప్ గ్రూపులో ఉన్న అందరి కాంటాక్ట్స్ సంపాదించాడు. అందులో రాజీవ్ కూడా ఉన్నాడు. వైభవ్ రాజీవ్ ఫోన్ నుండే ఫోటోలు అప్లోడ్ అయినట్లు తెలుసుకుని ఆ గ్రూప్ ని రిపోర్టు చేసి అది బ్లాక్ అయ్యేట్లు చేస్తాడు.


ఒక వ్యక్తి అలవాట్లను గురించి ఏమీ తెలీకుండా అతనితో స్నేహం చేయడం ప్రమాదం అని హెచ్చరిస్తాడు వైభవ్. రేణుక తన తప్పు తెలుసుకుని ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను అని చెబుతుంది.



Rate this content
Log in

Similar telugu story from Abstract