STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఫటాఫట్

ఫటాఫట్

2 mins
291

అయినా రాబోయే రోజుల్లో ఆడది ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అనే నియమం ఉండదేమోనే అంది చంద్ర.

హ్యాండ్ బ్యాగ్ సరి చేసుకుంటూ మళ్లీ ఏమైందే. గోపాల్ గారు ఏమైనా అన్నారా అంటూ కళ్ళెగరేసింది సరిత.


ఇద్దరూ నడుచుకుంటూ వెళుతున్నారు. రోడ్డు మీద పెద్ద రద్దీ లేదు. ఇద్దరూ బస్టాప్ చేరుకున్నారు.

ఏంటే! నేను అడిగిన దానికి ఏమీ చెప్పవు అని చంద్ర భుజాన్ని తన భుజంతో తట్టింది సరిత.


గోపాల్ నన్నెప్పుడూ ఏమీ అనరు. కానీ ఆయన ప్రేమతో దగ్గరకు తీసుకున్న ప్రతి సారీ నా గతం నన్ను వేధిస్తుందే. చంద్ర పొడి దగ్గు ఆమె గొంతులోని బాధను దాచలేకపోయింది.

సరిత చంద్రనే చూస్తోంది. నా గురించి వదిలేయ్. నువ్వు చెప్పు. ఈ ఆదివారం ఏంటి ప్లాన్ అని అంది చంద్ర. 


మన బాస్ ఇంకా తిలక్ కలిసి ఏదో బిజినెస్ ప్లాన్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళిద్దరినీ ఆదివారం భోజనానికి పిలిచింది. చెల్లెళ్లని కూడా చూసినట్లు ఉంటుంది అని నేను కూడా సరేనన్నాను. సరిత పమిట చెంగుతో చెమట తుడుచుకుంటూ చెప్పింది.


సరితా! నీతో పెళ్లి జరగాల్సిన ఇద్దరు మాజీ ప్రియులను చెల్లెళ్ళకు ఇచ్చి పెళ్లి చేసి ఎలా వాళ్లను ఫేస్ చెయ్యగలిగుతున్నావే? ఇబ్బందిగా అనిపించదా అని అడిగింది చంద్ర.


ఆడ దానికి పెళ్లి ఒక్కటే రక్షణ ఇంకా ప్రశాంతత ఇస్తుంది అని అనుకుంటారు. నాకు త్యాగం చేయడం మాత్రమే ప్రశాంతత ఇచ్చింది. నా మనసు మళ్లీ ప్రేమ వైపు వెళ్లకుండా రక్షణ ఇచ్చిందే అంది సరిత.

బస్సు కోసం ఎదురు చూసి ఇంకా రాకపోయేసరికి ఇద్దరూ నడవడం మొదలు పెట్టారు.


అందుకనే నేను అంటున్నాను ఆడది ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నేను నిరూపించలేకపోయాను. భవిష్యత్తులో ఎవరైనా నిరూపిస్తే మేలే. అప్పుడు చాలా మంది జీవచ్ఛవాలుగా బతకాల్సిన అవసరం ఉండదు. కొన్ని అంతు లేని కథలు చూడాల్సిన అవసరం ఉండదు అంది చంద్ర. 

చంద్ర మాటలు వినగానే చటుక్కున ఆగి సరిత చంద్ర చేయి పట్టుకుంది.


ఏంటే. నువ్వు ఏ అఘాయిత్యం గురించీ ఆలోచించట్లేదు కదా అని ఆందోళన వ్యక్తం చేసింది సరిత.

నాకు మళ్లీ ఆత్మ హత్యా ప్రయత్నం చేసేంత ధైర్యం లేదులేవే. ఈ శరీరంలో ఉన్న ఇంకో ప్రాణాన్ని చంపే అధికారం నాకు లేదు. ఫటాఫట్ అని ఏడుస్తూ నవ్వింది చంద్ర.


కంగ్రాట్స్ చంద్రా అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది సరిత.


ఇద్దరూ కలిసి నడుచుకుంటూ ముందుకు వెళుతున్నారు.


సూర్యుడు అస్తమిస్తూ సముద్రపు నీటిని ముద్దాడాడు.


(అంతులేని కథలో జయప్రద - సరిత

చంద్ర - ఫటాఫట్ జయలక్ష్మి)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract