STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Inspirational Others

విశ్వాసం

విశ్వాసం

4 mins
318

సరస్వతి చాలా తెలివైన అమ్మాయి...,తన నాన్నగారి బిసినెస్ పై పట్టు సాధించడం కోసం పీజీ మానేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ అయ్యింది...మరోవైపు తనకు ఇష్టమైన సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతుంటుంది....

చదువును మాత్రమే ఇష్టపడేవారిలో,దాన్ని ఒక కోర్స్ లా కాకుండా,అర్థం తెలుసుకునే దిశగా చదివేవారిలో ఒక మెరుపు ఉంటుంది...వారి అభిరుచులు,

,ఆనందాలు,పనులు అన్నీ పట్టుబట్టి చూస్తే,

చదవనివారిలో కూడా ఉత్సాహాన్ని రేపుతాయి...

అలాంటికోవకే చెందుతుంది సరస్వతి...పేరులోనే కాదు,గుణంలో కూడా సరస్వతి ఆమె....బయటి ప్రపంచానికి,మన ఆశయాలతో సంబంధం,అవసరం ఉండవు.....నిత్యం వాళ్ళు అందర్నీ కదిపి,దారి తప్పించి ఆనందం పొందుతారు....అంతా సరస్వతిలా మసలుకుంటే....దారి దేవుడే వేస్తాడు అన్నది నిజం...

ఓయ్!సీనియర్స్ కి నమస్తే చెప్పాలని తెలీదా?సరస్వతి మొదటి అడుగు క్లాసులో పడుతుండగా వినిపించిందో కంఠం...

సారి అండీ!నమస్తే!...అనేసి క్లాస్ లోకి వెళ్తుంటే...

ఈరోజు నీకు క్లాసు లేదు...గ్రౌండ్ కి పద! అన్నాడు సీనియర్ గౌతమ్...ఎంబీఏ ఫైనల్ చేస్తున్నాడు తను..

సర్!ఫస్ట్ రోజు క్లాస్ కి లేట్ గా వెళ్లకూడదు...ఇంకో అయిదు నిమిషాల్లో ప్రొఫెసర్ వచ్చేస్తారు...గ్రౌండ్ కి వెళ్ళడానికే పదినిమిషాలు పడుతుంది సార్...మళ్ళీ మీ పనిష్మెంట్ ఇంకొంచెం టైం....ప్లీస్ సర్..

చూడమ్మా! నీ పేరు ఏంటి??

సరస్వతి..సర్

గుడ్!ఆపేరు పెట్టుకుంటే చాలు చదువు వచ్చేస్తుంది..ముందు నువు గ్రౌండ్ కి పద...చిటికెలు వేస్తూ దారి చూపించేడు...

అలా అయితే మీ పేరు గౌతమ్ అని విన్నాను...ఈసరికి,ఈ గౌతముడికి బుద్ధి వచ్చేసి ఉండాలి కదా సర్!ప్లీస్..ప్రొఫెసర్ వచ్చేస్తున్నారు ...గుమ్మానికి అడ్డంగా ఉంచిన చెయ్యి కిందనుంచి దూరి,క్లాస్ లోకి వెళ్ళిపోయింది...

ప్రొఫెసర్ దగ్గరికి వచ్చేస్తూ ఉండడంతో...తర్వాత చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోయాడు...

సాయంత్రం వెళ్లిపోతున్న సరస్వతిని ఆపి,రేపు తొందరగా వచ్చి రాగింగ్ చేయించుకు వెళ్లిపో!సరేనా!అన్నాడు గౌతమ్

ఎస్ సర్! నవ్వుతూ సెల్యూట్ చేసి...ఇంచక్కా హీరోలా ఉన్నారు...బాగా చదువుకుంటే ఇంకా బావుంటుంది కదా సర్!మన మిడిల్ క్లాస్ ముఖ్యన్గా చదువు మీద శ్రద్ధ పెట్టాలి సార్! అమ్మానాన్న సంతోషపడతారు....అనేసి వెళ్ళిపోయింది...

ఏంట్రా బావా!ఫస్ట్ రోజే లైన్లో పెట్టేసావా? తొంభయ్యిలో అందగత్తెలందరూ నీకే పడిపోతారు...టూకే బాచ్ మా పాలిట యమకింకరుల్లా తయారయ్యేర్ర .....నవ్వుకున్నారు గౌతమ్ ఫ్రెండ్స్..

ఇంటికెళ్లాక పుస్తకం తెరిచి చూసేడు గౌతమ్...

ఏ నాన్నా!టర్మ్ ఉందా!పగలు ముందు వచ్చి చదువుకోవచ్చు కదరా! ఎప్పటిలానే అడిగినా,ప్రేమగా ఆడిగినట్టు అనిపించింది..

ఒక్కమాటకి మారతారా?మారిపోవాలా?అంత అవసరమా!...తర్కించుకుంటున్నాడు గౌతమ్

అవసరమే!మాగన్నుగా నిద్ర పడుతుంటే,విన్పించినట్టయింది...ఉలిక్కిపడి లేచేడు గౌతమ్...నేనేరా!వేదవా!ఎప్పుడూ మంచే చెబుతాను...నీకే కాదు అందరికీ...విను నాన్నా! బాగుపడతావు...మనసులోంచి వచ్చినట్టున్నాయి

ఆ మాటలు..నవ్వుకున్నాడు గౌతమ్

మర్నాడు తొందరగా వచ్చింది సరసు...గౌతమ్ కూడా వచ్చేడు...వీళ్ళకన్న ముందు సీనియర్ గర్ల్స్ గ్యాంగ్ వచ్చింది...ఈసారి సరసుని అమ్మాయిలు పిలిచేరు...

ఇలా రావే!నీపేరు ఏంటి?

సరస్వతి మేడమ్!అంది

ఈ లైనులో ఫస్ట్ కార్లో ఎవరు వెళ్తారో...వాళ్ళకి నువ్వు ఈ లవ్ యు చెప్పాలి..ఫోన్ తీసుకో!దీనిలో వాడు నీకు చెప్పే సమాధానం కూడా ఐ లవ్ యు అయి ఉండాలి.... సరేనా గ్రూవులో ఒకమ్మాయిని పిలిచి....చూడవే! దీని తేనేపలుకులు వినే హీరో ఎవరో?

మేడమ్!ప్లీస్ ....ఒక్కసారి ఐ లవ్ యు చెప్పినవారికి ఫిక్స్ అయిపోవాలి...నాకు ఎవరికి చెప్తానో అన్న భయం లేదు...ఒకవేళ అతను మీ బాయ్ ఫ్రెండ్ అయితే!?...ఆలోచించండి అంది ఓరగా చూస్తూ

ఏం పర్వాలేదు...యు కెరీ ఆన్...అంది సంజన అనే గ్రూప్ లీడర్

కార్ వస్తుంది...ఏయ్!చైర్మన్గారి అబ్బాయి సంజు!దీని రూల్ ప్రకారం సుడితిరిగింది ఇవ్వాళ అనుకున్నారు అంతా...

వద్దు!అని చెప్పేలోపులోనే ,కార్ ఆపుతుంది సరస్వతి

సర్!ఆపండి ప్లీస్...ఎదురుగా నిలబడి చేతులు క్రాస్ గా ఊపుతుంది..

కార్ ఆగింది....వాట్!అన్నాడు అద్దం దించుతూ హితేష్

ఐ లవ్ యు సర్!అంది సెల్యూట్ చేస్తూ...

గౌతమ్ ఆమె ధైర్యానికి విస్తుపోయినా,సీనియర్స్కి ఎం స్ట్రోక్ ఇచ్చిందిరా?తనలోనే నవ్వుకున్నాడు..

ఇట్స్ఓకే!అద్దం పైకెత్తి వెళ్ళిపోయింది కారు...

ఊపిరి పీల్చుకోవడం ఆపి చూస్తున్నారు సంజన గ్యాంగ్...కార్ వెళ్లిపోవడం చూసి ,ఏయ్!పదండే..

అనుకుంటూ ఫలయనం చిత్తగించేరు..

కానీ,ఓ పదడుగులు ముందుకెళ్లిన కార్ ఆగింది....ఎస్క్యూస్ మీ!ఆ గ్రీన్ చుడిదార్ అమ్మాయిని పిలవండి అన్నాడు అక్కడ నుంచున్న వాళ్ళతో...

చైర్మన్ కొడుకు అలా అడగడంతో....ఆ అమ్మాయి ఎవరా అని ఆసక్తిగా చూసేరు....మిమ్మల్ని సర్ పిలుస్తున్నారు...అన్నాడు అందులోంచి ఒకబ్బాయి

కమింగ్ సర్!పరుగులాంటి నడకలో వచ్చింది

ఇందాక ఏమన్నావ్?కళ్ళజోడు కిందకి దించుతూ అన్నాడు

ఐలవ్ యు సర్!తుపాకీ దెబ్బ తిన్న కాకుల్లా ఎగిరిపోయేరు అక్కడున్న స్టూడెంట్స్...

కారెక్కండి!అన్నాడు డోర్ తీస్తూ.

వెంటనే ఎక్కి కూర్చుంది...చిన్నకాగితంపై సంజు గ్యాంగ్ జరిపిన డీల్ గురించి రాసింది.....ఇక్కడ ఫోన్ ఆన్ లో ఉంది,మీ వాయిస్ వాళ్ళకి వినపడాలి సర్...హితేష్ కళ్ళు,సరసు రాస్తున్న అక్షరాల వెంట పరిగెడుతున్నాయు... చదువుకుందాం అని వస్తే ఈ టార్చెర్ ఎక్కువ అయిపోయింది సర్....మీరు నన్ను లాగి ఒక్కటి కొట్టేరనుకో వాళ్ళకి బుద్ధి వస్తుంది....

వాళ్ళడిగినట్టు ఐ లవ్ యు చెప్తే ,మనఃశాంతి వస్తుంది....

నేనెవరో తెలుసా?సైగ చేసేడు..

మన చైర్మన్గారి అబ్బాయి...వెరీ ఇంటెలిజెంట్ అంది సైగలతోనే

ఓ..అన్నాడు కళ్ళెగరేస్తూ.. కిందకి దిగేరు కార్ లోంచి..

నడుస్తూ మాట్లాడుకుందామా....ఇఫ్ యు డోంట్ మైండ్....

తప్పకుండా సర్....వెనకే నడుస్తుంది

అయితే మిస్ సరస్వతి...ఐ..చెప్పబోతుంటే ఆపింది

ఒక్కనిమిషం సర్...

ఏమైంది?చెయ్యి తిప్పుతూ అడిగేడు

మిస్ కాదు సర్...మిస్సెస్.సరస్వతి....అక్కడ నుంచున్నాడు చూడండి గౌతమ్...అతనే నా కాబోయే హస్బెండ్..

కానీ మేము చేసిన ఎంక్విరీ లో అతను సింగల్ కదా!

మార్నింగ్ అతనికి నేను ఐ లవ్ యు చెప్పాలి సర్....అది అతని డిమాండ్....నాకు కూడా నచ్చేరు తను....ఎదో సాధించాలి అనుకుంటారు...సరైన గైడెన్స్ లేక పక్కదారి పడుతున్నారు..జీవితంలో మంచి అనుకున్నవాటిని టక టకా అందుకుని,మన ఖాతాలో వేసేసుకోవాలి....జరిగితే జరుగుతాయి...లేకపోతే లేదు...

మరి నేనేందుకు ఐ లవ్ యు చెప్పాలి ...తప్పుకదా!అన్నాడు

సర్...ఐ లవ్ యు చెప్తే కొంపలేం మునగవు సర్...నేను ఇంటికి వెళ్తూనే లవ్ యు మమ్మీ అని అమ్మతో అంటాను....కనిపిస్తే నాన్నతో,అన్నయ్యా అందరితో చెప్తాను....దానికి హడావుడి ఎందుకు సర్?

యు ఆర్ ఎన్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషనిస్ట్ సరస్వతి...ఆమె విశ్వాసానికి ఆశ్చర్యపోతూ

ఎస్ సర్!ఇంఫాక్ట్ అందులో మీరు కూడా ఉన్నారు....మనిద్దరితో పాటు ఇంకా తొంభైయేనిమిది మంది ఉన్నారు..సర్!

ఫైల్ లోంచి ఒక పేపర్ తీసి చూపించింది....వీళ్ళు మన కాలేజీ హండ్రెడ్ పర్ఫెక్ట్ స్టూడెంట్స్ సర్! మనం అంతా కలిసి వెలికితీసినా,వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఊటలా ఊరుతుంది సర్....అసలైన భారతీయ తెలివితేటలుగల విద్యార్థులు వీళ్ళు....

అంటే అప్పటి గురుశుశ్రూష చేసి,చదువు నేర్చుకున్న టైపు సర్....ఇంకా ఇలాంటి వాళ్ళు ప్రతి కాలేజీలోను ఉంటారు....మనతో సహా ఎవ్వరూ ఉపయోగించుకోవడం లేదు సర్ వీళ్ళని....

ఒక్క నిమిషం....వీళ్ళతో నీకేం పని....సివిల్స్ కి తయారు అవుతున్నాను సర్...వీళ్ళల్లో మంచి politician,ఎకనామిస్ట్,లాజికల్ స్ట్రేటజీస్ ఉన్న బుర్రలు ఇవి....నా రెండు సంవత్సరాలు కోర్స్ లో,కాలేజీ కన్నా వీళ్ళే నన్ను ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తారు...ఈ వందమందితో ఫుల్ లెంగ్త్ ఒక రెండు గంటల ఇంటర్వ్యూ,ఒక్కొక్కరితో తీసుకున్నాననుకోండి....సివిల్స్ కొట్టి తీరుతాను....

ఇలా అయితే!మా కోచింగ్ సెంటర్లు దివాళా తీస్తాయేమో? అన్నాడు నవ్వుతూ

నాలా ఆలోచించేవారు ఇంకా బోల్డు మంది ఉండి ఉంటారు...అదే నిజమైతే,ఇప్పటికి ఎప్పుడో అవన్నీ మూతబడాలి కదా!సర్ అంది తాను కూడా నవ్వుతూ...

సరే !ఇపుడు ఎం చెయ్యాలి?

పాపం!ఈ ఫోన్లో ఎప్పటినుంచో వెయిటింగ్ సర్...ఐలవ్ యు చెప్పేస్తే,విని తరిస్తారు అంది...నేను కూడా వెళ్ళాలి...ఆయన ఎదురు చూస్తున్నారు...

లక్కీ గాయ్!అన్నాడు హితేష్

రోజక్క కూడా వెరీ లక్కీ సర్...

తను నీకు ఎలా తెలుసు?

తను చెప్పేరు అంది గౌతమ్ ని చూపిస్తూ...

చాలా సమాచారం అందిస్తారనుకుంటా మీ గౌతమ్...అయినామీరు నిన్ననే వచ్చేరు...ఇంతలో ఫ్రెండ్ ఎలా?ఆశ్చర్యపోయాడు హితేష్

కోచింగ్ సెంటర్ లో ఫ్రెండ్స్ సర్ మేము...

హితేష్:::ఒకేసారి లవ్ అండ్ ఎడ్యుకేషన్...ఎలా బాలన్స్ చేస్తున్నారు?సాధాణంగా లవ్ లో పడగానే చదువు పాడయిపోతుంది కదా!

నోటితో తింటాము...ముక్కుతో పీలుస్తాము,చెవిలో వింటాము,కళ్ళతో చూస్తాము...వాటిని చూసి నేర్చుకున్నది సర్ ఇదంతా!అవి వేటిపని అవే !ఎలా చేస్తాయో...మనం కూడా అలా ఉండాలి..

ఎందుకు ?అంతా మీకులా ఆలోచించరు అంటారు...ఇలా బుద్దిగా చదువుకుంటే భలే ఉంటుంది కదా!

మీరు నిజమైన బిసినెస్మన్ అనిపించుకున్నారు సర్.ఎక్కడబడితే అక్కడ స్టడీ సెంటర్ పెట్టేద్దామనా సర్...మీరన్నట్టు చదువుకుంటే బావుంటుంది...

కానీ ముందు చదువుకోవాలన్న శ్రద్ధ,ప్రతి స్టూడెంట్ కి ఉండాలి...చదవాలి అనిపించేలా వాతావరణం

మనమే అంటే మీరే ఏర్పాటు చేయాలి...

వాళ్ళల్లో ఒక విశ్వాసం,నమ్మకం కలిగించాలి ఇక్కడినుంచి బయటకు వెళ్లడం అంటే,జీవితంలో దేనికీ వెనక్కి తిరిగి చూడక్కర్లేద్దు అనేంతగా....

చదివేవాళ్ళుకూడా తెలుసుకోవాలి...ఆస్తి

పోగేయ్యాడానికే చదువు కాదని....

నైస్ మీటింగ్ యు సరస్వతి...ఎనీవే ఐ లవ్ యు...మీట్ యు సూన్ ఏస్ కలెక్టర్...మీ ఫస్ట్ విసిట్ కాలేజీ కే రావాలి...గుడ్ లక్ గౌతమ్...కార్ ఎక్కి వెళ్ళిపోయాడు హితేష్...

సంజుమామ్...హలొ...హలొ....ఫోన్ ఇవ్వడానికి వెనక్కి వస్తుంటే,కొంచెం దూరంలోనే ఎదురయ్యారు సంజు గ్యాంగ్....మమ్మల్ని క్షమించు సరసు...ఇది మొదలు...మేము రాగింగ్ చెయ్యం,జరగనివ్వం....తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చామో?దానిమీదే శ్రద్ధ పెడతాం....నీలాగా ఉండేవాళ్ళని ఏడిపిస్తే ఆనందం అనిపిస్తుంది...బహుశా!చదివిన చదువు బుర్రకి సరిగ్గా ఎక్కకపోవడం వల్ల కావొచ్చు...

కానీ నువ్వు లక్కీ...కాలేజ్ బెస్ట్ అబ్బాయి ని నువ్ తన్నుకుపోతున్నావ్....చైర్మన్గారి అబ్బాయి...ఇంత మంచి స్పీచ్ మేము ఫెస్ట్ లో కూడా ఎపుడూ వినలేదు...ఆయన ఎంతసేపు మాట్లాడ్డం వండర్...

రోమన్ సైనా,స్వాతి మీనా లని తన రోల్మోడల్ గా

చెప్పుకునే సరస్వతి, ఫైనల్ ఇయర్ మధ్యలో ఉండగా సివిల్స్ కి సెలెక్ట్ అయింది సరస్వతి....గౌతమ్ సివిల్స్ అందుకోలేకపోయాడు ,కారణం సరస్వతి నాన్నగారి బిసినెస్ నష్టాల్లో కూరుకుపోవడంతో...తన శ్రమని కూడా సరసుకె అందించేడు...హితేష్ సాయం చేస్తానన్న వద్దంది....గౌతమ్ మీద విశ్వాసంతో....గౌతమ్ కూడా అదే విశ్వాసంతో చదువుతున్నాడు ఇపుడు... గౌతమ్ కూడా కలెక్టర్ కావాలన్న, సరసు కోరిక నెరవేర్చడం కోసం....


.


Rate this content
Log in

Similar telugu story from Abstract