Parimala Pari

Inspirational

4  

Parimala Pari

Inspirational

ఉదయించిన శశి

ఉదయించిన శశి

2 mins
182చూసావా శశి! ప్రేమ ఎంత పని చేసిందో. భిన్నధృవాలు గా ఉండే మనల్ని ఒకటి చేసింది. అసలు ఎప్పుడైనా ఇలా జరుగుతుందని అనుకున్నామా!


అవును రవి, నేను కలలో కూడా అనుకోలేదు ఇలా మనిద్దరం కలుస్తామని. మనిద్దరం మనస్తత్వం లోనే కాదు పేరులోనూ భిన్న ధృవాలమే. నేను శశి, రాత్రికి వస్తే, నువ్వు రవి అంటే ఉదయాన్నే ఉంటావు. 


కానీ ఒకే ఒక్క విషయం మాత్రం మనిద్దరం ఏకాభిప్రాయంతో ఉండేది. నేను నా స్వశక్తితో నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకున్నాను. నువ్వు కూడా అదే అభిప్రాయంతో ఉన్నావు. 


రవి, చిన్నప్పటి నుంచి నేను చూసిన, పెరిగిన వాతావరణంలో నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా కనిపించారు నాకు. అందుకే నీ అభిప్రాయం తెలిసాక నీ మీద అభిమానం, ఆరాధనా భావం కలిగాయి. అందుకే నువ్వు పెళ్లి చేసుకుందాం అనగానే సరే అన్నాను.


మా ఇంట్లో మా నాన్నకి ఆడవాళ్ళ చదువుకోవడం ఇష్టం ఉండదు. కానీ అమ్మకి తను చదువుకోలేదు కాబట్టి నన్ను పెద్ద చదువులు చదివించాలని, నా కాళ్ళ మీద నిలబడేలా చేయాలని ఆశ. 


అదే కారణంతో నాన్న తో గొడవ పడి విడిగా వచ్చేసింది. కానీ అమ్మని అందరూ నానా మాటలు అన్నారు. ఆడ పిల్ల చదువు కోసం భర్తనే వదిలేస్తావా అని. అయినా గాని అమ్మ అవేమి పట్టించుకోకుండా, చాలా కష్టపడి నన్ను చదివించింది. నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అమ్మ. అందుకే నేను ఎప్పటికీ అమ్మ తోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ ఎప్పుడైతే నువ్వు నా మనసుని అర్ధం చేసుకుని, నా అభిప్రాయాన్ని గౌరవించి, అమ్మని కూడా మనతోపాటు ఉంచుకోవడానికి ఇష్ట పడ్డావో, అప్పుడే నా మనసు నీ వశం అయిపోయింది.


నన్ను నన్నుగా ఇష్టపడ్డావు. మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా నాకోసం వాళ్ళని ఎదిరించావు. చాలా థాంక్స్ రవి, నాకు ఇంత గొప్ప జీవితం ఇచ్చినందుకు.


శశి! భార్యాభర్తల మధ్య థాంక్యూ లు, సారీ లు ఉండవు. మనిద్దరం భార్యాభర్తలం కన్నా మంచి స్నేహితులం అంటే మంచిది. 


నువ్వు శశి అంటే చల్లని వెలుగును ఇస్తావు. అంధకారంలో ఉన్నవాళ్లకి వెలుగును పంచుతావు. నాలాంటి భగభగ మండే సూర్యుడికి, నీలాంటి చల్లని వెన్నెల తప్పకుండా అవసరం.రవి, ఒక్క మాట చెప్పనా, ఆ చందమామ ఉదయం సూర్యుడి వెలుతురుని తను గ్రహించి, చీకట్లో వెలుగుని పంచుతుంది. అలాగే నేను కూడా ఇదంతా నీ నుంచి గ్రహించిందే.


నేను మగవాడిని, నువ్వు ఆడదానివి అని ఎప్పుడూ వేరుగా చూడలేదు. మనం ఇద్దరం సమానం అన్న భావన తోనే ఉన్నావు. నువ్వు నాకు దొరకటం నా అదృష్టం రవి.


ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా మనల్ని అర్ధం చేసుకున్నారు. నాకు అదే చాలు. నాకోసం ఎక్కడ నువ్వు మీ కుటింబానికి దూరం అయిపోతావో అని చాలా బాధ పడ్డాను. ఆ దేవుడి దయ వల్ల అంత మంచే జరుగుతోంది మనకి. ఇంక ఈ జీవితానికి ఇది చాలు నాకు.


శశి ఇంకెప్పుడు నువ్వు అలా బాధపడకు. నువ్వు బాధ పడితే నేను చూడలేను. నీ సంతోషం కోసమే కదా నేను ఇదంతా చేసింది. అంటూ శశి ని హత్తుకుంటాడు. శశి కూడా రవి కౌగిలిలో ఒదిగిపోయింది.


ఆడ మగ సమానమని ఎప్పుడు ఈ లోకం గ్రహిస్తుందో అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు.


Rate this content
Log in

Similar telugu story from Inspirational