STORYMIRROR

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Others

4  

శ్రీదేవిమురళీకృష్ణ ముత్తవరపు

Abstract Drama Others

తొలకరిజల్లు

తొలకరిజల్లు

5 mins
379

అవి తొంభైల్లో కాలేజీ రోజులు..నా పేరు అష్రాఫ్..

ఇంటర్ వరకూ ఫుల్ డే ఉన్న సెషన్ ని,డిగ్రీ నుంచి హాఫ్ డే చేసేరు ..మా ఫ్రెండ్స్ అంతా రెండు బాచ్లు అయ్యేము..

ఆరేయ్!ఆర్ట్స్ అమ్మాయిలు భలే ఉంటారురా! ఉయ్ మిస్ దెం బాధపడ్డారు సైన్సువాళ్ళు..బీకాంలో జాయిన్ అయ్యేను..జీవితానికి పనికివచ్చేది,మార్చేది ఈ సమయం అష్రాఫ్.. కాలేజీ కి వెళ్తున్నావ్ రా జాగ్రత్త!అమ్మాయిలకు లైను వేసే అబ్బాయిలతో తిరగొద్దు..అమ్మాయిల వెనక అసలు పడొద్దు.అక్క షెహ్నాజ్ మరీ మరీ చెప్పింది...

టీటీసి ట్రైనింగ్ పూర్తయింది అక్కకి..జాబ్ కోసం చూస్తుంది..చాలా తెలివైంది..నా టెన్త్ మాథ్స్ ను, పూర్ నుంచి బెస్ట్ వైపుకు నడిపించిన దేవత అక్క...తన మాట వేదం నాకు..మేము కన్నామా?నువ్వు కన్నావా?అమ్మ ఆట పెట్టించేది మమ్మల్ని ఇద్దరినీ...

నాన్న రిజిస్ట్రార్ అయితే,ట్రాన్స్ఫర్ మీద సిటీ కి వచ్చెమ్..రెండేళ్లు అయింది.ఒక హిందు ఫామిలీ ఇంట్లో ,పై పోర్షన్ మాది..ప్రతి వంటా ఎక్స్చేంజి అయ్యేది..

శుక్ర,శనివారాల్లో వాళ్ళు నీసు ముట్టరని,అమ్మ వండడం మానేసింది..ఓనర్ అంటీ,అమ్మకి అంతలా దోస్తీ కుదిరింది..

నేను కాలేజీకి బయలుదేరేను...

ఆల్ ది బెస్ట్ అష్రాఫ్ ఓనర్ రఘు అంకుల్ పలకరించేరు...

థాంక్ యు రఘు బాబాయ్ ..చెప్పి బయలుదేరేను

మళ్ళీ మొదటిరోజు, పండక్కి వచ్చినట్టు ముస్తాబయి వచ్చేరు అంతా..ఓణీ,రెండుజడల్లో వచ్చిన అమ్మాయిల్లో,మా గ్రూప్ సుచిత్ర నన్ను కొంచెం కదిలించింది..న్యూ జాయిన్ అనుకుంటా..కొత్తగా బెరుగ్గా ఉంది..మూడురోజులు అయినా ఎవరూ ఫ్రెండ్స్ అయినట్టు లేరు..ఒక్కమ్మాయే వస్తుంది..వెళ్తుంది..

అక్కమాటలు చెవుల్లో రింగులు తిరుగుతున్నాయి..

అయినా చూస్తే ఏమైందిలే!?అని సరిపెట్టుకుని,

చూడడం మొదలుపెట్టేను..

మా గార్డెన్ పార్టీ వచ్చింది..తను వస్తుందా!రాదా!అనుకున్నాను...వచ్చింది పసుపు పట్టులంగా,

పచ్చవోణీ లో ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నా ..సిటీ బస్ మాట్లాడేం..అందరూ అందులో సరిపోలేదు..

కొంతమంది అమ్మాయిల్ని వేరే బస్ ఎక్కించే పని,నాకూ ,వెంకటర్రెడ్డి కీ అప్పజెప్పేరు..

మొదటిసారి మాట్లాడింది...బస్ వెళ్లిపోయిందాండి?!నన్ను,రెడ్డి ని చూస్తూ..

నువ్వే చెప్పుకో!అన్నట్టు చూసేడు రెడ్డి

నేను రాముడు మంచి బాలుడు అన్నట్టు..వచ్చేస్తుంది..వాళ్లంతా మన క్లాసే..వాళ్ళతో నిలబడండి అన్నాను..

అమ్మో!వాళ్ళు రెడ్డిగారి బాచ్ అంటన్డి..వాళ్ళతో జాగ్రత్త అని మా అన్నయ్య చెప్పేడండి..నేను ఆ షెల్టర్ లో కూర్చుంటాను..బస్ వస్తే పిలవండి చెప్పేసి వెళ్ళిపోయింది...

చంద్రబోస్ గారి అచ్చమయిన తెలుగు పాటలా,తన మాటలు నాలో అల్లుకుపోయాయి..

మా ఇంగ్లీష్ లెక్చరర్ కార్ లో మా పార్టీ కే వస్తూ...అమ్మాయిలకు లిఫ్ట్ ఇవ్వమని అడిగినందుకు

మమ్మల్ని ఆకాశానికి ఎత్తేరు..ఎంత భరోసాగా తీసుకువెళ్తున్నార్రా అంటూ..

తను,రాధ అనే అమ్మాయి ఎక్కబోయేసరికి కార్ ఫుల్ అయింది..కాదు అలా జరిగింది..రెడ్డి నాకు లైన్ క్లియర్ చెయ్యడం కోసం...ముందుగా ఎక్కి కూర్చున్న సుచిత్ర ఒక్కదాన్నే దింపడం బాగోదని చెల్లెలు రాధని కూడా దించేడు..

అయ్యబాబోయ్!బండి మీద అయితే నేను రానండి..మా అన్నయ్య బస్ అని తెలిసాకే ఒప్పుకున్నాడు..బండి అంటే...చంపేస్తాడు.

ఏ బాచ్ మీ అన్నయ్య..రెడ్డి అడిగేడు

ఎంఏ పాలిటిక్స్ ,ఫైనల్ చేస్తున్నాడు..ఇక్కడే ఉన్నాడు చూపించింది..

రెడ్డి వెళ్లి ఏదో మాట్లాడాడు..జాగ్రత్త !అష్రాఫ్ ...నమ్మకంతో పంపిస్తున్నాను..చాలా ప్లీసింగ్ గా చెప్పేడు వాళ్లన్నయ్య..

మా అక్క మాట నిజమే!నీమీద మేము పెట్టిన నమ్మకం,ఆ అమ్మాయిపై వాళ్ళింటివాళ్ళు పెట్టుకుంటారు..అంతే!అందుకే మనసుని పరుగులు పెట్టించకుండా నెమ్మదిగా తీసుకువెళ్ళేను..

ఇది మా అమ్మగారి ఊరండి...మూడు స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి..జాగ్రత్తగా బండి తోలండి..మేము జాగ్రత్తగా ఉంటామని, పేరు పెట్టడానికి ఈ ఊర్లో సగం మంది చూస్తూ ఉంటారని చెప్పిందండి మా అమ్మ..మధ్య మధ్య లో నాతో మాట్లాడకండి..

అంది కానీ,ఇది మా బాబాయ్ ఇల్లు,మూడో అన్నయ్య ఇల్లు,అత్తయ్య ఇల్లు,చెప్తూనే ఉంది..ఇంత మంది చుట్టాలా!?అనుకున్నాను..

తమ్ముడూ!భయపడకు...ఈ అమ్మాయి ఇలాగే వాగుతుంది..సైలెంట్ గా ఉంటే ముంచేయాలనే ఆలోచనలు వస్తాయట..అందుకని ఎపుడూ

వాగుతూ ఉంటుంది...నువ్వు వేరేలా అనుకోకూ!?

..అంది రాధ

రాధ ది మా క్లాసే..కానీ థర్డ్ ఇయర్ చదివే ఏజ్ ఆమెది..కొన్ని అనారోగ్యకారణాల వల్ల ఆగిన చదువును ,ఇపుడు కొనసాగిస్తోంది..అందరూ రాధక్క అనే అంటారు ఆమెను ....

నాకు కొంచెం భయం,గౌరవం కూడా పెరిగి పార్టీ అయిన తరువాత చూడడాలు,ఆలోచించడాలు మానేసాను..కానీ అల్లాతో చెప్పెను...ఆమె నాకు సరైనది ఆయితే,నువ్వే మాకు ఒక్కటయ్యే దారి వెయ్యి...లేదన్నా నాకు ఇష్టమే...రోజూ నమాజులా తల్చుకునేవాడిని...అంతే!

ఫైనల్ ఇయర్ సెండ్ ఆఫ్ పార్టీ ..సాయంత్రం నాలుగు నుంచి ఆరు వరకూ అని అందరికీ ఇచ్చినట్టే ,

ఆఫీసువాళ్ళు,ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇచ్చేరు..ఆయాని ఆరు వరకూ ఉంచేవారు అన్ని పార్టీ లకి,ఆమె కామన్

స్నేహానికన్న మిన్న అంటూ గొంతు సవరించింది..

సాధారణంగా ఇష్టమయినపుడు ,వారిలో అన్ని విషయాలూ అద్భుతంగా తోస్తాయేమో!?నేను మాత్రం ఆమె పాటకి ఎంత మురిసిపోయానంటే..

.రోజూ పొద్దున్నే ఆ పాట వింటూనే లేవడం మొదలుపెట్టేను...

మీవాళ్ళంతా అంత తెల్లగా ఎలా ఉంటారండీ!?

మీరు చాలా అందంగా ఉంటారండీ..మీరంటే చాలా...చాలా...ఇష్టమండి..అమ్మ వాళ్ళకి వేరే కులమే ఇష్టం ఉండదు..ఇంక మతం ఎలా ఇష్టపడతారు?అయినా వాళ్ళతప్పు కూడా లేదేమో!?అండి..మీరుకూడా సినిమాలో లాగా చూస్తూ ఉన్నారు కానీ నన్ను పెద్దగా ఏడిపించలేదండి..మీరు మతం మార్చుకుంటే...(ఆలోచించింది కొంచెం సేపు),

పాపం మీ అమ్మగారికి కూడా అలా ఇష్టం ఉండదేమోనండి!?...నాకు మాత్రం వెధవ వస్తాడండి ..పాపం మీరు ఇష్టపడినట్టు,నాతో పెళ్లి కాలేదుకదండీ!..మీకు మాత్రం మంచి అమ్మాయి వస్తుంది...నేనే మాట్లాడేను ఇలా అని తప్పుగా అనుకోకండి...మైండ్లో ఏమి ఉన్నా

,చెప్పేసుకోవాలండి...లేకపోతే బుర్ర పాడయిపోతుంది..కళ్ళు తుడుచుకుని వెళ్ళిపోయింది..

రెడ్డి ఏమైనా సాయం కావాలా?సైగ చేసేడు కళ్లతో..

వద్దు!అన్నాను నేను కూడా..నా కళ్లూ!మాట్లాడే పరిస్థితుల్లో లేవు..

మూడు సంవత్సరాల స్వచ్ఛమైన,అమాయకమైన ప్రేమ నన్ను వదిలి వెళ్లిపోతుంటే...ప్రాణం మెలిపెట్టినట్టు అయింది..

అల్లాని తిట్టుకున్నాను..ఇలా చేస్తావనుకోలేదని!?

మనసులో ఒకటి పెట్టుకు ,మరొకటి కోరుకోకూడదు అని..సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు అనిపించింది...

అప్పుడే అనుకున్నాను నేను హిందువుల అమ్మాయినే చేసుకుంటాను..బాగా చూసుకోవాలి..ఇక్కడ నేను నా భార్యని చూసుకున్నట్టూ..అక్కడ తాను కూడా వాళ్ళింట్లో చూడబడాలి అని ఈసారి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను...

నా ఆట అల్లా విన్నాడు..ఇంకో సుచిత్ర నా భాగస్వామి అయింది..మా అక్క నవ్వింది..

ఎందుకక్కా!అన్నాను..

నీ పిచ్చి కాకపోతే,మనలో మంచిపిల్లలు లేరా!?నీలాంటి భర్త రావాలని మనలో ఎంతమంది కోరుకుని ఉంటారో కదా!అంది

వాళ్ళకి నాకన్నా మంచి మొగుడ్ని ఇమ్మని,అల్లాకి మొక్కుతాను అన్నాడు..

అల్లాకి నీ ప్రేమగాంగ్ ని తయారు చేయడం తప్ప పనిలేదా!?నెత్తిమీద మెట్టింది ప్రేమగా

కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అన్న పాటలా....బహుశా!హైద్రాబాద్ నగరం ,కలపని మిత్రులు లేరేమో!?

ఇరవైఏళ్ళ తరువాత,సరదాగా హైద్రాబాద్ వెళ్ళినపుడు, ఫ్రెండ్స్ చాలా మంది సెటిల్ అవుతూ,అయ్యి కనిపించేరు ...పిల్లలతో బావున్నారు అంతా...

మా లోటు అదే!పిల్లలు లేరు..నా పిచ్చి సుచిత్ర ఇంకో పెళ్లి అంటుంది..అంత మంచిది...నేను ఎవరినైనా దత్తత అన్నాను..ఇక్కడికి ఆ పనిమీదే వచ్చేము..ఇంకా ఒక పెళ్లి పిలుపు పై కూడా..

భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నది నిజం..పెళ్ళిలో సుచిత్ర కనిపించింది..నవ్వుతూ పలకరిస్తుంది అందర్నీ...నలభైకే అరవైదాటిన ముసలితనం వచ్చేసింది..అంతమంది అయినవాళ్ళకి చెప్పేది?ఎవరూ అంతగా పట్టించుకున్నట్టు లేరు..అందరూ ఉండవే!ఆపు నవ్వు!విసుక్కుంటూనే ఉన్నారు..

గిఫ్ట్ ఇవ్వడానికి వేదిక మీదకి వెళ్తే...ఆ...ష్రాఫ్...అంది సుచిత్ర

ఈమె మీకు తెలుసా!?వెనక ఉన్న ఎవరో ఆడిగేరు..

నా క్లాస్మెట్ డిగ్రీలో అంది నా భార్య సుచిత్ర,నన్ను ఆపుతూ..

కానీ ఎప్పుడూ ఈమె ముందు పలికిన పేరు చెబుతుంది రోజూ...ఆ..ష్ అని ఎదో !?

సూచిత్రాఅష్రాఫ్ ...నా పూర్తిపేరు..అంది నా భార్య మళ్ళీ..మేము క్లోజ్ ఫ్రెండ్స్ డిగ్రీలో..

మీరు ఈవెనింగ్ వరకూ ఉంటారా ప్లీజ్!?కొంచెం మాట్లాడాలి..పెళ్లికూతురు మా పిన్ని కూతురు...నేనిక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్ అన్నాడు అతను...ఇరవై ఏళ్ళు ఉంటాయి దగ్గర దగ్గర అతనికి...

సాయంత్రం వరకూ ముళ్ళమీద కూర్చునట్టు ఉంది..బోలెడన్ని ఆలోచనలతో రోజు గడుస్తున్నట్టు లేదు నాకు..

రాత్రి ఏడు అవుతుండగా వచ్చేడు ఆ అబ్బాయి..

నమస్తే సర్!నా పేరు అష్రాఫ్..

నా పేరు..ఆశ్చర్యన్గా చూసేను నేను..

నేను సుచిత్రగారి కొడుకుని..అంటే పెంచుకుంది అమ్మ నన్ను...మూడు సార్లు పిల్లలు పుట్టి చనిపోవడంతో,సంతానం ఉండదని తెలిసి,మా నాన్న కానీ నాన్న రెండోపెళ్లి చేసుకున్నారు..

బోలెడంత ఆస్తి,బంగారం,చుట్టాలు,మేళాల మధ్య మంచి,సబంధంగా ఆయనతో పెళ్లి అయింది..అన్ని అలవాట్లు ఉన్నాయి...రోజూ తాగడం,అమ్మని కొట్టడం..ఈ మధ్యలో రెండు అబార్షన్,ఒక అబ్బాయి పుట్టి పోవడం అమ్మని షాక్ కి గురి చేసింది...నాన్నని ప్రత్యక్షంగా ఆమెతో చూసిన,అప్పటి నుంచి జరిగిన మోసానికి ఏడుపు మానేసి,నవ్వుతూనే ఉంది..

ఇవ్వాళ మిమ్మల్ని గుర్తు పట్టింది..నాదో హంబుల్ రిక్వెస్ట్..నేను అమ్మతో పాటూ ,...ఆగేడు అతను

చెప్పండి .పర్వాలేదు!నాకు గొంతు పూడుకుపోయింది

మాట రావట్లేదు..

అడగొచ్చో!లేదో! మాట బెరుగ్గా ఉంది..

ఏమైనా ఫర్వాలేదు చెప్పమ్మా! సుచిత్ర అంది

అమ్మకి నయం అవుతుందన్న ఆశ ఇపుడే కలిగింది..నేను యూఎస్ కి వెళ్ళాలి అసలు...కానీ పర్వాలేదు...ఆగుతాను..డబ్బులకు కూడా ప్రాబ్లెమ్ లేదు..

మీరు మాతోపాటూ ఉంటారా!?సుచిత్ర అడిగింది

నేను ఆశ్చర్యపోయాను..ఎలా అర్థం అయింది దీనికి అనుకుంటూ...

ఆ!అవును అమ్మా!మా అమ్మకి నయం అవుతుందన్న ఉద్దేశ్యమే!మీ దగ్గర ఉంటాం...లేదా మీకు దగ్గరగా వేరే ఇంట్లో...

ఎం వద్దు!ఎపుడు బయలుదేరుదాము ఆష్..అనబోయి ఆగింది నా సుచిత్ర..

ఎం పర్లేదు అన్నాను నేను..పేరు పలకడానికి జంకుతుందని తెలిసి...

అమ్మా!నిజమా!సంతోషంతో నా భార్య చేతులు పట్టుకున్నాడు అష్రాఫ్..

అంతే!మా ఇంకో ప్రయాణం మొదలైంది..వెళ్తుంటే కార్ లో అష్రాఫ్ తో అంటుంది నా భార్య..

మా ఇంట్లో ఉన్నందుకు మీరు ఫీ కట్టాలి!

చెప్పండి ఆంటీ!అమ్మ ఆరోగ్యం సరయితే,మీకు నిలువు దోపిడీ ఇస్తాను అన్నాడు..

అవ్వేమీ వద్దు!నీ పేరు మార్చుకో!లేదా నేను ఇంకో పేరు పెట్టుకుంటాను...ఈయన పేరుతో నిన్ను పిలవడం కొంచెం ఇబ్బందిగా ఉంది..ఎపుడైనా నిన్ను తిట్టాల్సి వచ్చిందనుకో!...ఆదన్నమాట అంది

నేను నవ్వుకున్నాను...

తప్పకుండా ఆంటీ....వద్దు...నేను కూడా మిమ్మల్ని అమ్మా!అని పిలుస్తాను..నాకు చాలా బావుంటుంది..మీకు ఎలాగూ పిల్లలు లేరు..నన్ను పెంచుకోండి ...అంతా ఇక్కడే ఉందాం...అన్నాడు నవ్వుతూ.

తప్పకుండా ఆదర్శ్...ఇప్పటి నుంచి నీ పేరు ఇది...నేను మీ అమ్మనే!ఈయన్ని నీ ఇష్టం వచ్చినట్టు పీల్చుకోవచ్చు...

ఇంటికి వెళ్ళేక...నీ పెద్ద మనసుకు థాంక్స్ చెబుదాము అనుకుంటే...నా భార్య నాకు దొరికితే ఒట్టు...కొడుకు ,సుచి అంటూ వారి చుట్టూనే తిరిగేది..ఒకసారి అంది థాంక్స్ అల్లాకి చెప్పండి..ఆయన మామూలు మంచి చెయ్యలేదు మనకి అని...నిజమే!ఆయన్ని ఎప్పుడో అడిగేను నీ ఇష్టం వచ్చినదాన్ని ఇవ్వు..నేను సంతోషన్గా స్వీకరిస్తాను అని...

నా జ్ఞాపకాన్ని సరికొత్తగా మార్చి నాకే ఇచ్చేడు మరి ..



Rate this content
Log in

Similar telugu story from Abstract