తెగిన గాలిపటం
తెగిన గాలిపటం


తెగిన గాలిపటం....!!!!
గాలిపటల దుకాణం లో ఒక్క గాలిపటం ......
నన్ను ఎవరన్నా కొనుక్కోండి రా బాబు అనుకుంటూ ఉంది....ఎన్నో రోజులుగా
అటుగా వెళ్తున్న ఒక్క వ్యక్తి ఆ గాలిపటలు చూడగానే ఏదో గుర్తువచ్చి ...... ఆ దుకాణం లోకి వెళ్లి ఒక్క గాలిపట్టని కొనుకుంటాడు ఎంతో ప్రేమగా....
హమ్మయ్య ఇప్పటి కైనా విముక్తి దొరికింది అనుకుంటుంది ఆ గాలిపటం
తాను ఆ గాలిపటన్ని గాలిలోకి ఎగరేస్తూ దాన్ని ఎక్కువ దూరం పోనివ్వటంలేదు.....అది ఎక్కడ తెగిపోయి తన నుండి వెళ్ళిపోతుంది ఏమో అని అనుకోని....
విడు ఎవడు రా.... నన్ను పైకి ఎగరనివ్వటం లేదు అని అనుకుంటున్న అంతలో.....
పెద్దగా గాలి వచ్చి ఆ గాలిపటం తెగిపోతుంది......
ఆ తెగిపోయినా గాలిపాటన్ని చూసి కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఈ గాలిపటం కూడా నా కొడుకులనే దూరమైపోయింది అనుకుంటూ భాద పడుతూఉంటాడు
అంతలో ఆకాశం లో ఆ గాలిపటం ఎగుతూ ఉండటం చూసి..... చాలా ఆనందంగా......ఆ ఎగురుతున్న గాలిపటం లో తనకు దూరం అయిన కొడుకుని చూసుకుంటూ .......అలా చూస్తూ ఉంటాడు.....
ఆ గాలిపటం దొరికిన వ్యక్తి......దాన్ని పైపైకి ఎగేస్తూ ఉన్నాడు........తెగిపోయినా పర్లేదు ఆ గాలిపటం అన్నట్లు.....
కింద
నుండి తనవైపే చూస్తున్న వ్యక్తిని ....గర్వంగా చూస్తూ ఉంటుంది ఆ గాలిపటం....
కొత్తసమయనికి ఆ వ్యక్తి అక్కడ నుండి సంతోషంతో వెళ్ళిపోయాడు
అతను వెళ్లిన కొంతసమయనికి ......
బాగా పైకి ఎగిరిపోయా అని గర్వం తోఉన్న ఆ గాలిపటం రెక్కలు విరిగి..... పడిపోతూఉంటుంది......
హమ్మయ్య లేట్ అవుతుంది........అనుకుంటూ ఎగరేసిన వ్యక్తి అక్కడ ఉంది వెళ్ళిపోయాడు.....
ఆ గాలిపటం గాలికి ఎగురుకుంటూ వెళ్లి ముళ్ళు మీద పడి గాలిపటం అంత చిరిగిపోతు ఉంది........గాయపడిన సెరీరంతో ఎగరలేని స్థితిలో బాధపడుతున్న ఉన్న ఆ గాలిపట్టని..... కళ్ళ నిండా నీళ్లతో ఆ గాయపడిన గాలి పట్టాన్ని జాగ్రతగా తీస్తూ ఉంటాడు ఒక్క వ్యక్తి.....
(ఎగురుతున్నదీ నా గాలిపటం అని సంతోషంతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఇంతలో.....తన కళ్ళ ముందే ఆ గాలిపటం వచ్చి ముందు ఉన్న ముళ్లపై పడిపోతుంది)
కాంట్టినిండా నీళ్ళతో దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాడు ఆ వ్యక్తి.......
ఆ గాలిపటం ఆ వ్యక్తి కన్ననిల్లును చూస్తూ ఉండిపోతుంది......!!!
_తేజు