సందర్శన
సందర్శన
వైచిత్రి నిజంగానే విచిత్రమైన గ్రామం....ఆ ఊరిలో ,అన్ని ఊర్లలోలాగా రేషన్ వస్తేనో,సహకార సంగం ఎన్నికలో,పోలియో చుక్కలు వేస్తారనో టముకు వెయ్యరు.....
ఆ ఊరి అమ్మాయిని కానీ,అబ్బాయిని కానీ వేరే ఊరు ఇవ్వాల్సి వస్తే ......అపుడు ఊరు అంతటికీ చెప్తారు...వాళ్ళని సదరు గ్రామ ప్రజల సందర్శనార్థం ఇళ్ళకి రమ్మంటారు... నిశ్చతార్థం సగం పెళ్లితో సమానం అని నమ్ముతారు....ఇరు వర్గాలు అందుకు ఒప్పుకుంటేనే సందర్శన ఉంటుంది....లేకపోతే పెళ్లె జరగదు......
మోడరన్ పిల్లలు వచ్చాక ఊరనుంచి,ఊరి బయటి నుంచి కూడా తిరుగుబాటు మొదలైన,అంతే మొత్తంలో అణిచివేత కూడా జరిగింది.హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలని ఒక ప్రముఖ పేపర్ లో కూడా ఒక మూల వచ్చింది....ప్రముఖ విషయాలు అలాగే వస్తాయి మరి.....
మీ ఊరోళ్ళు అందగాళ్ళు,అందగత్తెలా....ఈ స్వయంవరాలు, సందర్శనాలు ఏంది? అని లుంగీ,చీరలు ఎగ గట్టినోళ్ళకి ....మా ఊరు రమ్మని మిమ్మల్ని దేవులాడలేదే అని సమాధానం మాత్రం చెప్పేరు అంతే!!ఎవరుమాత్రం ఎం మాట్లాడతారు ఇంక??
ఇదిలా ఉంటె పట్నం పోకడ మరీ ఒక అడుగు ముందుకేసి,ఆ ఊరి అబ్బాయిని చూపులకి చూడడానికి వెళ్లి,నచ్చలేదని చెప్పి,మన అమ్మాయిల పవర్ ఎంటో ? ..నిరూపిస్తానని నడుం కట్టిన ఓ ధీర వనితను నమ్మిన ఓ కుర్రగాడు నిశ్చితార్దనికి సిద్ధమయ్యాడు
ఆ అబ్బాయి రాజు గారి పెద్దబ్బాయి....ఇక తంతు మొదలైంది......
ఇందుమూలంగా యావన్మంది గ్రామ ప్రజలకు తెలియజేసేది ఏమనగా ...ఈ రోజు పదిగంటలకి రాజుగారి పెద్దబ్బాయిని ,చూసుకోవడానికి పట్నం నుంచి పెళ్ళికూతురు ,వారి బంధువులు వస్తున్నారు గాన,మీరంతా దశమి ఘడియలు దాటకుండా... రాజుగారింటికి రావాలండహోం...టన్కు టన్కు టన్కు టకా.....టన్కు టన్కు టన్కు టకా.....వాయించుకుంటా పోయేడు గ్రామనౌకరు సత్తియ్య.....
వంటింట్లో మునిగిపోయిన చాలా మంది ఇల్లాళ్ళు... ఎం చీరలు,నగలు దిగేసుకోవాలా!? అన్న మీమాంసలో పడ్డారు....
మగాళ్లు మాత్రం పదిగంటలకి కదా!! పైగా లుంగీ,ఖద్దరు చేతుల బనీను....ముందే ఏసేసుకుని....రావిచెట్టుకాడ కూర్చుంటే....ఇశేషాలు మొదట తెలిసిపోతాయని అక్కడికి బయదేల్లి పోయేరు....
ఈ గుంపు ముందే వెళ్ళిపోతుంది అన్న విషయం చూసిన, ఆవగింజ బాచ్లో మొదలైన కల్లోలం ...అంతా ఇంతా కాదు...కానీ ఏమీ చేయలేని పరిస్థితి...ఇంట్లో అత్త,మామ్మగార్లు పొరుతుండగా వాళ్ళకి వంట ముగించి ముస్తాబై బేదెల్లేరు...
రాజుగారి పెద్దబ్బాయి చాలా చలాకీగా ఉంటాడు....ఎలాంటి సంబంధం వస్తుందో? వాళ్ళు జంటని చూసి ఎం చెప్పాలో,చెప్పకూడదూ....లాంటి మాటలు మాట్లాడుకుంటూనే,తప్పు ఉంటే కుండా బద్దలుగొట్టాలిరోయ్....మొన్నోమాటు అయిన గొడవ అయ్యి,చీటికీమాటికి పేపర్లో రాకూడదు అని నిర్ణయించారు మగాళ్ల బాచ్....
ఇక ఆడవాళ్లు రామాలయం దగ్గర పోగయ్యారు.... గద్వాల్ చీర కట్టుచెంగు దగ్గర అంచు ఇవ్వడు
....అందుకే నేను అలాంటి చీరలు కొనను పిన్నీ అని ఒకరు అంటే....
ఒలే!మొన్న అన్నయ్య తెచ్చిన కమ్మలు ఎట్టుకోపోయావా?? ఏమీ కాదు...బాగా ఆనతావు సందర్శనలో అని వదినీ గెడ్డం కిందకి చెయ్యి పెట్టి....మరొకళ్ళు నవ్వులు ఒలకబోసుకున్నారు...
ఇంతలో నల్లగా మెరిసిపోతూ కార్ ఒకటి దూసుకుంటా వెళ్లిపోయింది వీళ్ళ మీద దుమ్ము రేగ్గొడుతూ...
యవ్వారం ఎంటోగానే.... సానా తేడాగానే ఉంది...వులేయ్ పెద్ది!పద ఓ సూపు సూద్దాం....అంటూ బయలుదేరేరు ఆడజనం....
మగాళ్లకి ఎం అర్థం కాలా....ఆడపిల్ల ఎక్కడైనా...మనింటిపిల్ల లాంటిది కదా! ఈళ్లేంటి రయ్యిన పోయినోళ్లు,పోయినట్టే ఉన్నారు...ఓ పాలి ఆలోసించాల్సిందే....అంటూ మగాళ్ల బాచ్ బయలుదేరింది...
ఉరుకులాంటి నడకలో వెళ్లిన అందుకోలేకపోయేరు....సందర్శన మొదలైంది....లైనులో వెళ్తూ....బావుంది....బావుంది....బాగాలేదు...నచ్చలేదు..వోటింగ్ మొదలై....నచ్చలేదు కి ఎక్కువ ఓట్లు పడ్డాయి...
చివరగా శాస్త్రులుగారు నిర్ణయం చెప్పను లెవబోతుంటే...ఎక్స్....క్యూజమీ....ఇంత పొడుగు సాగదీసింది ఒక్క పదాన్నే....
నత్తి ఒలే పిల్లకి..అని .ఒకరు
పాపం!పిల్ల తెల్లగానే ఉంది...
దేవుడు చిన్నచూపు చూసేడు...అయ్యో...
అబ్బో !తెగ వ్యాఖ్యానాలు చేసేసుకుంటుంటే....మరోమారు పలికింది చిలక
...ఈసారి ఒక్క పెడకే పలికేసింది ముక్కని...
ఎక్స్క్యూజ్మీ....నాకు అబ్బాయి నచ్చలేదు...ఇంతమంది మేకల్లా ఎగబడి చూడడం అస్సలు నచ్చలేదు...స్వయంవరాలు వగైరాలు ఆడవాళ్ళ వ్యవహారాలు...అబ్బాయి ఇలా కూర్చుంటే....వీడికి పెళ్ళాం దొరక్క సంతలో పెట్టినట్టు ఉంది....దాన్ని మాట్రిమోనీ అంటారు మా సిటీ లో....ఓ....పోలో మని చెప్పుకుంటా పోతుంటే ....ఆ ఊరి ప్రెసిడెంట్ అడ్డం తగిలేడు ఆమె మాటలకి...
చూడమ్మాయ్! మా రూల్సు మాయి...నువ్వు వత్థానంటేనే సందర్శన ఏర్పాటు చేసేం....వచ్చాక పొలాల్లో బొమ్మ డాన్స్ వేస్తే చుత్తా కూసోమ్...నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవాలిసిందే కొంచెం కటువుగానే పలికేడు...
ఫోన్ తీసి ఎవరితోనో మాట్లాడింది....వెంటనే కుయ్....మంటూ పోలీస్ జీప్ ఆగింది....
ఆ పిల్ల పోలీసాయన దగ్గరికెళ్లి...ఏమో మాట్లాడింది...ఆయన లాఠీ చేతులు మారుస్తూ....అబ్బాయి ముందుకొచ్చి నిలబడ్డాడు....మొదటిసారి ఊళ్ళోకి పోలీసులు రావడం కొంచెం భయం వేసింది అందరికి....అయిన మళ్ళీ ప్రెసిడెంట్ పూనుకుని...ఈ పిల్ల రుబాబు సూడండయ్యా...ముందు పెళ్లి ఇట్టం అంది....ఇపుడు కత అద్దం తిప్పింది....మా పిల్లాడు బతుకు ఎం కావాలా? ....సందర్శన మెచ్చిన జంటని...పెళ్లికూతురు వద్దంటే...రేపు మా ఊరిలో ఎవ్వరూ ఆడుకి పిల్లని ఇవ్వరు...అసలుకే ఇలాంటి ఇరకాటం ఉంటదనే,మేము బయటి సంబంధాలు జోలికి ఎల్లం...ఈ పిల్ల మావోడ్ని కాలేజీ లో ఇట్టపడిందంటా...అందుకే ఈ పాలికి ఒప్పుకున్నాం....
కానీ ఆడపిల్లల్ని ఇలా సంతలో కూర్చోపెట్టడం నేరం...తెలుసా మీకు పోలీస్ అడిగేడు అక్కడి సమూహాన్ని....అందుకే చట్టాన్ని మార్చుకోండి....ఆటవికత వడలండి....
ఏంటీ!ఓ పోలీసాయనా!మా ఊరికొచ్చి ఎపుడైనా దొమ్మి,దొంగతనం,రేపు కేసులు అని రికార్డ్లో ఎక్కించావా?
లేదే!అన్నాడు పోలీసు..
మరెందుకు సామీ!హక్కులు...ఆవక్కాయ ముక్కలు అని క్లాసులు పీకుతారు...మేము ఇక్కడ ఆడొల్లకి ముప్పయిమూడు రేసేర్వేషన్ ఇచ్చం...మీరింక నాగరికత అని చెప్పుకుంటూ పెండింగ్ పెట్టేరు...
మా ఊరి అడా,మగా డిగ్రీకి తక్కువ సదవలేదు పోలీసుబాబు...అయిన పెద్దోళ్ళు మాట ఎవరూ కాదనరు...
మా ఊరి పిల్ల,పిల్లొడ్ని ఒక్కడని అడగండి ఈ ఊర్లో పడి,మగ్గిపోతున్నాం....బయటకు పోనివ్వరు మమ్మల్ని అని....ఇక్కడే ఉండిపోవడం వరంలాగా సద్దుకుపోతారు వాళ్ళు...
సందర్శన సిన్న విషయం ల ఆనుతుందా మీకు...పెళ్లి చేసుకుంటున్నవారికి భరోసా...అడా మగా తేడా చూడకుండా ఎవరితో తప్పు ఉన్నా,ఇక్కడ చర్చకు తెస్తాం...సర్దుబాటు చేస్తాం...ఎలాంటి అనుమానం ఇద్దరిలో ,ఒకరిమీద ఒకరికి ఉండదు...అంతమంది పెద్దల ఆశీర్వాదం ముందు నుంచీ ఉండబట్టి, పిల్లలుకూడా హద్దులో ఉంటారు...మా ఊరు మొత్తం సూసిన...మీ పట్నం బతుకుల గాలి కూడా చొరబడదు...ఏసీలు, ఫ్రీజ్జులు అని మేము వాతావరణం పాడుచేసుకోమ్....అబ్బో సెప్పాలంటే సానా ఉంది....వినడానికి వివరం ఉంది...
ఆయమ్మకి నచ్చకపోతే పొమ్మనండి... మా ఊరికి మనం బోర్డులో రాసుకున్నట్టే,సందర్శనకు ఒక గాడిద వచ్చింది అనుకుందాం అన్నారు గుంపులో ఎవరో....
గొడవ అబాసుపాలయ్యేలా ఉంది అని,ఆమె తల్లితండ్రులు పక్కకి తీసుకెళ్లి బుద్ధులు చెప్పుకున్నారు...వివరం అర్థం చేసుకున్న పిల్ల పెళ్లికి సరే అంది....తప్పుకి క్షమించమని అడిగింది...
ఆ రకంగా ఆ ఊరికి పట్నం నుంచి కూడా సందర్శన జరిగిందని ...చెప్పుకుని సంతోషపడ్డారు అంతా...
