Anjani Gayathri

Inspirational Others

4  

Anjani Gayathri

Inspirational Others

🌹 శ్రీ గురుభ్యోనమః🌹

🌹 శ్రీ గురుభ్యోనమః🌹

3 mins
405



🌹 శ్రీ గురుభ్యోనమః 🌹

 రచన :- అంజనీ గాయత్రి


 సుధీర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టాక అనేక జిల్లాలలో బదిలీల రీత్యా పర్యటించి సక్రమంగా తన బాధ్యతలు నిర్వర్తించి కలెక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు.


 అలా కొన్ని సంవత్సరాలు అనేక జిల్లాలలో చేశాక సొంత జిల్లా అయిన కోనసీమజిల్లాకు కలెక్టర్గా బదిలీ అయింది. తన సొంత జిల్లాకు తాను కలెక్టర్గా వెళ్లడం అంటే అతడికి ఎంతో సంతోషంగా ఉంది.

 తన జిల్లాను అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవకాశం వచ్చినందుకు మహదానంద పడిపోతున్నాడు. ఈ అవకాశం అందేలా చేసిన భగవంతుడికి శతకోటి నమస్కారాలు సమర్పించుకున్నాడు.



 ఒకరోజు ఉదయాన్నే అతడు ఆఫీసులో ఉండగా కలవాలని పదవి విరమణ అయిన ఒక వృద్ధుడు , చాలా కాలంగాతనకి పెన్షన్ రావడం లేదని, తమ గ్రామ విఆర్ఓ మరియు సచివాలయానికి సంబంధించిన ఇతర సిబ్బంది తాను ఎంత మొరపెట్టుకున్నా ఆ పని సక్రమంగా చేయడం లేదని అందుకే తనకి ఓపిక నశించి కలెక్టర్కు మొరపెట్టుకుందామని వచ్చానని చెప్పాడు.


 ఆ ముసలాయన మాట్లాడుతున్నంత సేపు కనురెప్పలు ఎగరేస్తూ కళ్ళు మిటకరించడం , మాటకు ముందు " ఏవోయ్ " అని అనడం జరుగుతుండడంతో ఆయనతో మాట్లాడిన కాసేపటికి సుధీర్ ఆయన కాళ్లపై పడి " నన్ను దీవించండి గురువుగారు , నేను మీ పూర్వ విద్యార్థిని సుధీర్ ని... మీరు, నేను చదవకుండా అల్లరి చేస్తే బెత్తంతో కొట్టి చీకటి గదిలో పెడతాను అని బెదిరించిన రోజులు... శుంఠ అని తిడుతూ మంచిగా పాఠాలు బోధించిన ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తే.. ఈరోజు కలెక్టర్ గా ఈ స్థాయిలో ఉన్నానంటే మీరు నేర్పించిన నైతిక విలువలు మరియు చదువు సంధ్యలు మంచి మాటలు నా భవిష్యత్తుకు బంగరుబాటలు వేశాయి , నన్ను గుర్తుపట్టారా మాస్టారు... నేను మీ సుధీర్ ని, " అని తన చిన్నతనం అంతా గుర్తు చేసుకుంటూ ఆయనకు పాదాభివందనం చేస్తూ నమస్కరించాడు.


" చాలా సంతోషం నాయన... చదువు సంధ్యలు నేర్పిన విద్యార్థులు గురువులకి సొంత బిడ్డల లాంటివాళ్లే. కన్న తల్లిదండ్రులు జీవితానికి బాటలు వేస్తూ జీవితాంతం తోడుగా ఉంటారు. చదువు నేర్పిన గురువులు విద్యతోపాటు నైతిక విలువలతో కూడిన లోకజ్ఞానం నేర్పి దేశ ప్రగతికి పాటుపడేలా దేదీప్యమానంలా వెలిగే దివ్య జ్యోతిలా తయారు చేసి బంగారు భవిష్యత్తుని ఏర్పరుస్తూ వారిని చక్కని దేశ పౌరులుగా తీర్చిదిద్ది దేశంలోకి దివ్యతారలుగా వెలుగొందెలా పంపుతారు. అందుకే తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకి ఇచ్చారు.* మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ * అన్నారు.. " అందుకే అంటూ ఆయన వివరణాత్మకంగా శిష్యుడిని భుజం తట్టి ఆశీర్వదిస్తూ దీవెనలు అందించారు.


" మీకు పెన్షన్ వెంటనే వచ్చేలా నేను చేస్తాను గురువుగారు.. కానీ మేడంగారు మీ అబ్బాయి రాజేష్ ఎలా ఉన్నారు?? చూసి చాలా రోజులైంది " ప్రేమ పూర్వకంగా వివరాలు అడిగాడు.



" ఇంకెక్కడ రాజేష్??... బాబు.! మా ఆనందం చూసి కళ్ళు కుట్టిందేమో ఆ భగవంతుడుకి.. రోడ్ యాక్సిడెంట్లో వాడిని మాకు దూరం చేస్తూ తీసుకుపోయాడు. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి కొంతలో కొంత బాధ అనేది మాకే మిగిల్చాడు. అదే పెళ్లి అయితే భార్య పిల్లలు ఉంటే వారికి బాధే కదా. చిన్నవయసులోనే మమ్మల్ని వదిలేలాచేసి తీసుకుపోయాడు. ఆ భగవంతుడికి జాలీ దయా లేదు, మీ మేడం నేను అలా వాడిని తలుచుకుంటూ బతుకుబండిని ఈడుస్తున్నాం. మాకు ఇంకా చావు రాలేదని ఏడ్చిన రోజు లేదు, " అంటూ చిన్నపిల్లాడిలా కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు రామనాథం మాస్టారు.


 ఆయన వివరాలన్నీ తెలిసాక సుధీర్ మనసంతా బాధతో నిండిపోయి, " మాస్టారు మీకుఅండగా నేనున్నాను... వెంటనే మీ పెన్షన్ మీకు అందుతుంది. నాకు వెనక అమ్మానాన్న ఎవరూ లేరు. వారు కూడా నాకు దూరమయ్యారు. జాబ్ వచ్చి జీవితంలో స్థిరపడితే కానీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. జాబు వచ్చింది కానీ నేను ఇప్పుడు ఒంటరి వాడినే..  నా దగ్గరకు వచ్చేయండి మాస్టారు, " అంటూ ప్రేమ పూర్వకంగా ప్రాధేయపడ్డాడు .


 "వద్దు బాబు.. నువ్వే మమ్మల్ని వచ్చి చూస్తూ ఉండు. నీకు ఎప్పుడైనా పెళ్లి కుదిరినా మేము అడ్డంకి కాకూడదు. తల్లిదండ్రులుగా నీ మంచి చెడ్డలు మేము చూస్తాం. నీ పెళ్లి మా చేతుల మీదుగా జరిపిస్తాం. కానీ మేము మా ఇంట్లోనే ఉంటాం," అని సున్నితంగా అతడి మాట తిరస్కరించారు మాస్టారు.


" తల్లిదండ్రులనే అంత మాట అన్నారు.. అది చాలు మాస్టారు నాకు.. మీరు మీ ఇష్టప్రకారం మీ ఇంట్లోనే ఉండండి.. మీ బాగోగులు మంచి చెడ్డలన్నీ మీ కొడుకుగా నేనే చూసుకుంటాను. గురువులకి విద్యార్థులే తమ సొంత సంతానంతో సమానం . * శ్రీ గురుభ్యోనమః *" అంటూ ఆయనకి నమస్కరించి ఆయన పనులన్నీ చక్కగా నెరవేర్చాడు కలెక్టర్ అయిన సుధీర్.


 🌹గురుపూజోత్సవం సందర్భంగా ఈ నా కథ మా గురువులకు అంకితం. 🌹 🙏🏽.

✍🏼అంజనీ.


Rate this content
Log in

Similar telugu story from Inspirational