Anjani Gayathri

Inspirational Others

4.5  

Anjani Gayathri

Inspirational Others

🌹 అమ్మ చేతివంట🌹

🌹 అమ్మ చేతివంట🌹

2 mins
372


అమ్మచేతివంట


రచన :-అంజనీగాయత్రి 


అమృత ఇంటివెనకకట్టిన పాకలో కట్టెల పొయ్యి పై పెద్ద మూకుడులో నూనె పోసి జంతికలు , చిట్టి గారెలు, అరెసలు చేస్తోంది." ఏం చేస్తున్నావ్ అమృత? " అంటూ 

 వాసు వచ్చాడు.


" ఏమీ లేదండి, పిల్లలు రోజు ఆకలి అంటారు కదా, నాలుగు రోజులకు సరిపడా పిండి వంటలు, చిరుతిండి కోసమే ఇవన్నీ చేస్తున్నా ను. కొంచెం రుచి చూసి చెప్పండి, ఎలా ఉన్నాయో? " జంతిక, చిట్టి గారెలు ప్లేటులో వేసి ఇచ్చింది.


 ఒక్కటొక్కటిగా తింటూ " అమ్మ కూడా ఇలాగే చేసేది, " అని మెచ్చుకోలుగా అన్నాడు వాసు. వెంటనే ముఖం ఎర్రగా కంద గడ్డలా మారిపోయి " ఎలా ఉందో చెప్పమన్నా , మీ అమ్మగారు చేసినట్లు ఉన్నాయా?? " అని నేను అడగలేదు అని ముఖం మాడ్చుకుంది.


" నీకు ఎలా మాట్లాడి నా తప్పే, అమ్మ కూడా కట్టెల పొయ్యి పై సన్నని మంటపై పిండి వంటలు 

వేస్తే బాగుంటాయని అనేది అని చెప్పాను, నువ్వు కూడా బాగానే చేసావు అనే ఉద్దేశంతో అన్నాను, ఆ మాటకే అంత కోపం ఎందుకు?? " ఏ మాట సరిగ్గా అర్థం చేసుకోవు అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.


 ఈ మగవాళ్ళంతా ఇంతే, " "బాగుంటే అమ్మ చేసినట్లు అనో వదిన చేసినట్లు అనో పోలుస్తారు కానీ బాగా చేశావ్, చాలా బాగుంది " అనే మాట నోట్లోంచి రాదు, " మనసులో తిట్టుకుంటూనే పిండి వంట పూర్తిచేసి కట్టెల పొయ్యిలోనిప్పులు బయటకు లాగి నీళ్లు జల్లి ఆర్పేసి, ఇంట్లో కి వెళ్ళింది.


 పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, " అమ్మ ఆకలి వేస్తోంది, ఏదైనాచేసావా?? " అని అడగటమేతరువాయి, వెంటనే ప్లేట్స్ లో అరిసెలు, జంతిక, చిట్టి గారెలు పెట్టింది. ఆవురావురంటూ తిన్నారు. " చాలా బాగున్నాయి అమ్మ, " అంటూ కితాబిచ్చారు పిల్లలిద్దరూ.


" మీకైనా ఉందిరా ప్రేమ, ఎంత కష్టపడి ఇవన్నీ చేశానో, అయినా మీ నాన్నకి నేను చేసినవి ఎప్పుడు బాగున్నాయని చెప్పరు, " ముఖం చీర కొంగుతో తుడుచుకుంటూ చెప్పింది పిల్లలకి.


 " మేము చెప్తాం కదా, నాన్న గారిని అడగడం ఎందుకు, ఆయనెప్పుడూ బాగున్నప్పుడు చెప్పరు కదా?? అంటే బాగున్నాయి అని అర్థం చేసుకోవాలి. బాగోకపోతే వెంటనే నోరు తెరుస్తారు " ఏడ్చినట్టు ఉన్నాయి, " అని అంటారు కదా అని తండ్రిని ఇమిటేట్ చేశారు పిల్లలు.


" చాలా బాగా చెప్పారు రా, మీ ఇద్దరూ నా బంగారు కొండలు, " అని మురిసిపోయింది, కోపం అంతా ఎగిరిపోయింది ఆ క్షణంలో 😄


 ఆడవాళ్ళకు ఎవరికైనా తాము చేసే వంటలు బాగున్నాయి అని చెప్తే ఉబ్బితబ్బిబ్భై ఎవరెస్టు శిఖరం ఎక్కినంత సంబరపడతారు.


 అందుకే ముందర కాళ్ళకి బంధం గా నచ్చినా నచ్చకపోయినా, బాగున్నా బాగోక పోయినా, ఎందుకైనా మంచిది, ఇల్లాలు చేసే వంట మెచ్చుకుని తీరాల్సిందే మగ మహారాజులు లేదంటే ఏం జరుగుతుందో ఊహించుకోవడమే .


🌹🌹సమాప్తం 🌹🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational