Anjani Gayathri

Inspirational Others

4.8  

Anjani Gayathri

Inspirational Others

🌹 అక్కయ్య ప్రేమ 🌹

🌹 అక్కయ్య ప్రేమ 🌹

2 mins
326


🌹 అక్కయ్యప్రేమ 🌹

రచన :- అంజనీగాయత్రి


" రోజులో ఒక ఆరుసార్లు అయినా ఫోన్ చేస్తుంది రా వాళ్ళ అక్కయ్య!! " అని ఉద్యోగంలో సెలవు దొరకడంతో ఇంటికి వచ్చిన కొడుకుతో భర్త గురించి ఆడపడుచు గురించి చెబుతూ , ఆమె తన కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని మీ నాన్నని అడుగుతోంది రా , అని కుమార్ తో చెబుతూ అసలు విషయం బయట పెట్టింది సువర్చల.


"అమ్మా !! ఎప్పుడో చిన్నప్పుడు చూశాను పర్ణికని . ఇప్పుడు ఎలా ఉందో , తన పద్ధతి ఎలా ఉంటుందో ?? తెలుసుకోకుండా పెళ్లి అంటే ఎలాగా?? అత్త ఆ మాట అన్నాగాని , మీరు మాత్రం ముందే మాట ఇవ్వలేదు కదా?? " అని సందేహం వెలిబుచ్చాడు .


 " ఏమోరా!! మీ నాన్న ఏమన్నారో నాకు తెలియదు , నేను మాత్ర0 మీ నాన్నతో ముందే చెప్పాను , వాడికి నచ్చకుండా చేయొద్దు అని , "అనేసి తన అభిప్రాయం చెప్పి ,


 "పోనీలేరా పర్ణిక ని చూశాకనే అన్ని నచ్చితేనే ఓకే చేద్దాం , నువ్వేమీ కంగారు పడకు , అక్కా తమ్ముళ్లు ఎంత ప్రేమగా ఉన్నా నీకు అండగా నేనున్నాను , " అంటూ కొడుకుకి హామీ ఇచ్చింది.


 అనుకోకుండా ఒక రోజు కుమార్ మేనత్త నిర్మల మరియు ఆమె కూతురు పర్ణిక కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చారు . కుమార్ ఇంకా ఇక్కడే ఉన్నాడు ఉద్యోగం చేసే ఊరు ఇంకా వెళ్ళలేదు.


 నిర్మల రావడంతోటే తమ్ముడు సుందరంతో కలిసి తన చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ సంతోషంగా , గడుపుతుండగా పర్ణిక వంటింట్లో సువర్చల దగ్గర చేరి అన్ని పనులులో సహాయం చేస్తోంది. వంటలో కూడా సహాయం చేస్తూ వంకాయ కూర వండింది.


 సుందరానికి , నిర్మల కి, కుమార్ కి , సువర్చలకి కూడా డైనింగ్ టేబుల్ మీద భోజనం వడ్డిస్తుంటే , సువర్చల, "నువ్వు కూడా మాతో పాటు తినమ్మా , పర్ణిక!! " అని అనగానే ,


 " నాకు ఇపుడు ఆకలిగా లేదు అత్తయ్య , నేను తర్వాత తింటాను, " అంటూ నలుగురికి అన్నం వడ్డించి, వారు తిన్నాక అన్ని సర్ది , పెరట్లో కూర్చుని వీక్లీ మ్యాగజైన్లో స్టొరీ చదువుతోంది పర్ణిక . ఇంతలో కుమార్ ఫోన్ మాట్లాడడానికి అని అక్కడికి వచ్చాడు, అక్కడి నుండి లేచి ఇంట్లోకి వెళ్ళబోయింది ఆమె, కానీ అతను ఆమె చేయి పట్టుకుని ఆపాడు .


 ఉలికిపాటుగా తలెత్తి చూసి వెంటనే సిగ్గుతో తలదించేసింది. కలువ కళ్ళు , కోనేరు లాంటి ముక్కు, చిన్ని నోరు , శంఖం లాంటి మెడ వెరసి బాపు బొమ్మలా ఉంది పర్ణిక. మనిషిమాత్రమే కాదు పద్ధతి కూడా బాగా నచ్చింది కుమార్ కి , ఆమె అలా సిగ్గుపడుతుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ " నేనంటే నీకు ఇష్టమేనా?? " అని ఆమె కళ్ళలోకి చూస్తూ ప్రేమగా అడిగాడు .


 దించిన తల ఒకసారి పైకి ఎత్తి , సిగ్గుతో వెంటనే కనురెప్పలు

వాల్చేసి , "పో బావా!! అంటూ అతని చేతులు విడిపించుకొని , ఇంట్లోకి తుర్రుమంది .


 "ఇప్పుడు పోతాను లే వచ్చాక , నీ మెడలోమూడు ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటానులే , "అని ఆమెకు వినిపించేట్టుగా అన్నాడు.


 వెళ్ళిపోబోతున్న ఆమె మాత్రమే కాదు , అప్పుడే అక్కడికి వచ్చిన సుందరం , నిర్మల , సువర్చలా కూడా విని సంతోషంతో ఇద్దరు ఒకరికి ఒకరు నచ్చారని తెలిసి త్వరలోనే పెళ్లి కి ముహూర్తాలు పెట్టి అంగరంగ వైభవంగా వారిద్దరి పెళ్లి చేశారు .


 అక్కా తమ్ముళ్ళ ఇద్దరు ఆనందానికి అవధులు లేవు . పర్ణికని కోడలుగా చేసుకున్నాక , అక్కయ్య ఒకత్తి ఒంటరిగా ఉంటుందని , తన దగ్గరే ఉండమని చెప్పాడు . నిర్మల ఇప్పుడు సుందరం ఇంట్లో ఉంటోంది . సుందరంకి అక్కయ్య ప్రేమ మరింత దగ్గర అయింది.


..... సమాప్తం....


 🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Rate this content
Log in

Similar telugu story from Inspirational